చలికాలంలో బైకులు, కార్ల‌ మైలేజీ ఎందుకు తగ్గుతుంది? నివారణ చర్యలేంటి?

First Published | Nov 20, 2024, 9:38 PM IST

Why bike and car Mileage Decreases : సాధార‌ణంగా సరికాని టైర్ ప్రెజర్ లేద పేలవమైన అలైన్‌మెంట్ - తక్కువ పీడనం ఉన్న లేదా అలైన్‌మెంట్ లేని టైర్లు కార‌ణంగా మైలేజీ త‌గ్గుతుంది. అయితే, చ‌లికాలంలో బైకులు, కార్ల మైలేజీ త‌గ్గుతుంది  ఎందుకు? దీనిని ఎలా నివారించాలి?

Car, bike,

Why bike and car Mileage Decreases : మీకు కారు లేదా బైకు ఉందా? అయితే, చ‌లికాలంలో మీ వాహ‌నాల మైలేజీ త‌గ్గుతున్న‌ట్టు మీకు అనిపించ‌వ‌చ్చు. అవును నిజ‌మే చ‌లికాలంలో వాహ‌నాల మైలేజీ త‌గ్గుతుంది. చలికాలం పెరుగుతున్న కొద్దీ మైలేజీ తగ్గడం మొదలవుతుంది. అయితే, దీని వెనుక కారణం మీకు తెలియకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మైలేజీని ఎలా పెంచుకోవచ్చో, అస‌లు చ‌లికాలంలో వాహ‌నాల మైలేజీ ఎందుకు త‌గ్గుతుంది?  మీ వాహ‌నం మైలేజీ త‌గ్గ‌కుండా ఏం జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

ఇంజిన్ కూలింగ్:

శీతాకాలంలో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గిపోతాయి. మ‌రీ ముఖ్యంగా సాయంత్రం, ఉద‌యం వేళ‌ల్లో చ‌ల్ల‌గా ఉంటుంది. చల్లని వాతావరణంలో ఇంజిన్ వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇంజిన్ దాని ఆపరేటింగ్ ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు, అది మరింత ఇంధనాన్ని కాల్చేస్తుంది. అలాగే, కోల్డ్ ఇంజన్ ఇంధనాన్ని సమర్థవంతంగా కాల్చలేకపోతుంది, ఫలితంగా మైలేజీ తగ్గుతుంది.

ఇంజిన్ ఆయిల్ పై ప్రభావం:

ఇంజిన్ ఆయిల్ చల్లని వాతావరణంలో మందంగా మారుతుంది, దీని వలన ఇంజిన్ కదిలే భాగాలపై మరింత ఘర్షణ ఏర్పడుతుంది. ఈ అదనపు రాపిడిని తగ్గించడానికి ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. దీంతో మీ వాహ‌నం మైలేజీ త‌గ్గుతుంది. 


Cars

టైర్ లో గాలి తగ్గుదల:

చల్లని వాతావరణంలో టైర్ గాలి ఒత్తిడి తగ్గుతుంది. తక్కువ గాలితో కూడిన టైర్లలో రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, దీని వలన ఇంజిన్ పై భారం ప‌డుతుంది. దీంతో మైలేజ్ తగ్గుతుంది.

గాలి-ఇంధన మిశ్రమం ప్రభావం:

చలి వల్ల గాలి సాంద్రత పెరుగుతుంది. దీంతో సరైన గాలి-ఇంధన మిశ్రమాన్ని నిర్వహించడానికి ఇంజిన్‌కు ఎక్కువ ఇంధనం అవసరం. ఈ ప‌రిస్థితుల కార‌ణంగా కూడా మైలేజీ త‌గ్గుతుంది. 

బ్యాటరీపై అదనపు లోడ్:

శీతాకాలంలో బ్యాటరీపై ఎక్కువ లోడ్ ఉంటుంది, ఎందుకంటే చలిలో ఎక్కువ శక్తి అవసరం. అలాగే, డీఫ్రాస్టర్, హీటర్, ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాల ఉపయోగం కూడా ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. 

షార్ట్ డ్రైవ్‌ల ప్రభావం:

చలికాలంలో ప్రజలు ఎక్కువ సేపు వాహనాలు నడిపే బదులు తక్కువ దూరాలకు వాహనాలను ఉపయోగిస్తారు. త‌క్కువ దూర ప్ర‌యాణాలు చేసే డ్రైవ్‌లలో ఇంజిన్ పూర్తిగా వేడెక్కదు, ఇది మైలేజీని ప్రభావితం చేస్తుంది.

చలికాలంలో మైలేజీని పెంచే మార్గాలు ఏమిటి?

వాహనాన్ని నడపడానికి ముందు, ఇంజన్‌ని కొంత సమయం పాటు రన్నింగ్‌లో ఉంచండి, తద్వారా అది ఆపరేటింగ్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఇలా చేయాలి క‌దా అని వాహనాన్ని ఎక్కువసేపు స్టార్ట్ చేసి ఇంధనాన్ని వృథా కాకుండా జాగ్ర‌త్త‌గా ఉండండి. 

టైర్ గాలిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. దానిని సరైన స్థాయిలో నిర్వహించడంతో మైలేజీ త‌గ్గ‌కుండా ఉంటుంది.  అలాగే, తక్కువ స్నిగ్ధత ఇంజిన్ ఆయిల్ ఉపయోగించాలి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా లూబ్రికేట్‌గా ఉండే చల్లని వాతావరణాలకు అనువైన ఇంజిన్ ఆయిల్‌ని ఉపయోగించడంతో మైలేజీ పెరుగుతుంది. 

ఇంధన-సమర్థవంతమైన డ్రైవింగ్ కూడా మైలేజీ విష‌యంలో కీల‌క అంశం. క్రమంగా వేగాన్ని పెంచండి. అలాగే, హార్డ్ బ్రేకింగ్‌ను నివారించండి. కార్ల‌లో సాధ్యమైన చోట క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించండి.

కారులో అదనపు సామాను లేకుండా చూసుకోండి. ఎందుకంటే అధిక బరువు మైలేజీని ప్రభావితం చేస్తుంది. డీఫ్రాస్టర్, హీటర్ వినియోగాన్ని పరిమితం చేయండి. అవసరమైతే తప్ప వాటి వినియోగించ‌క‌పోవ‌డం ఉత్త‌మం. సాధ్య‌మైనంత వ‌ర‌కు తగ్గించండి. ఈ చ‌ర్య‌ల‌తో చ‌లికాలంతో పాటు ఇత‌ర రోజుల్లో కూడా మీ వాహ‌నాల‌ మైలేజీ త‌గ్గ‌కుండా ఉంటుంది. 

Latest Videos

click me!