పెళ్లి క్యాన్సిల్ అయినా ఇన్సూరెన్స్ పొందొచ్చు. ఎలాగంటే?

First Published | Oct 20, 2024, 5:34 PM IST

మీ ఇంట్లో జరగాల్సిన పెళ్లి వేడుక అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యిందా? డోంట్ వర్రీ.. మీ పెళ్లి వేడుక రద్దయినందుకు మీకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. మీరు విన్నది నిజమే. పెళ్లి క్యాన్సిల్ అయినందుకు కూడా బీమా నగదు పొందొచ్చు. దీనికి ప్రాసెస్ ఏమిటి ? ఏఏ విషయాలకు కంపెనీలు ఇన్సూరెన్స్ ఇస్తాయి? ఏ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయో ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోండి.   

వివాహం, ఆచారాలు, వేడుకలు, కార్యక్రమాలు మొదలైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వడం మన సంప్రదాయం. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది మాత్రమే కాదు. సామాజిక నిర్మాణం, ఆలోచనలు ప్రవర్తనలను కూడా కలిగి ఉంటుంది. నిజానికి వివాహం అనేది కుటుంబం, సమాజానికి పునాది అని చెప్పవచ్చు.

ఈ కాలంలో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ధనవంతులైతే ఒక పెళ్లికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. సరే.. డబ్బున్న వారు కాబట్టి ఖర్చుపెడుతున్నారు అనుకోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా ఆస్తులు అమ్మి వారింట్లో పెళ్లిళ్లు చేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతి పెళ్లికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఘనంగా పెళ్లిళ్లు చేయాలని అప్పుల పాలవుతున్న వారూ ఉన్నారు.  పేదలు కూడా పెళ్లిళ్ల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దాచుకున్న డబ్బంతా కట్నంగా, పెళ్లి ఖర్చులకు వాడేసి తర్వాత అవస్థలు పడుతున్నారు.   

నేడు వివాహాలకు అసాధారణమైన ఖర్చులు చేస్తున్నారు. నివేదికల ప్రకారం ఈ సంవత్సరం దేశంలో దాదాపు 35 లక్షల వివాహాలు జరుగుతాయి. దీనికి రూ.4.25 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. వివాహ వేడుకల ఖర్చు పెరుగుతూనే ఉంది. గ్లోబల్ వెడ్డింగ్ సర్వీసెస్ మార్కెట్ డేటా ప్రకారం 2020లో వివాహ ఖర్చు 60.5 బిలియన్ డాలర్లు అయ్యింది. ఇది 2030 నాటికి 414.2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

Latest Videos


అసలు పెళ్లి ఏర్పాట్లకే రూ.లక్షలు, రూ.కోట్లు ఖర్చవుతున్నాయి. పెళ్లి చేయడానికి ఒక ఫంక్షన్ హాల్ రెంట్ కి తీసుకుంటే సిటీస్ లో అయితే దాదాపు రూ.10 లక్షలు చెల్లించాలి. టౌన్స్ లో అయితే రూ.4 లక్షల వరకు కట్టాల్సి ఉంటోంది. ఇక పెళ్లి భోజనాల ఖర్చు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కో ప్లేట్ భోజనానికి ఐటమ్స్ ను బట్టి రూ.300లకు పైగానే తీసుకుంటున్నారు. ఇక వచ్చిన బంధువుల సంఖ్యపై పెళ్లి భోజనాల ఖర్చు ఆధారపడి ఉంటుంది. కనీసం 1000 మంది వస్తే రూ.3 లక్షలు ఖర్చవుతుంది. మళ్లీ గిఫ్టులు, ట్రాన్స్ పోర్ట్, డ్రెస్ లు, నగలు ఇలా ఖర్చు తగ్గించుకోవడానికి ఎక్కడా అవకాశం ఉండదు. అందుకే పెళ్లి ఖర్చులు రూ.లక్షలు, రూ.కోట్లు దాటిపోతున్నాయి.

ఇంత పెద్ద ప్రణాళికలో అనేక అనిశ్చితులు ఉన్నాయి. వివాహ రద్దు, ప్రమాదం, అగ్నిప్రమాదం లేదా వివాహ వేడుకను ప్రభావితం చేసే ప్రకృతి వైపరీత్యాలు జరిగితే బీమా అందించడానికి అనేక సంస్థలు ప్రత్యేక బీమా పథకాలను ప్రవేశపెట్టాయి. ఇవి ఒక భద్రతా కవచంగా పనిచేస్తాయి.

ఏదైనా కారణం చేత వివాహం రద్దయినా లేదా వాయిదా పడినా హోటల్, రవాణా బుకింగ్‌లు, చెఫ్‌లకు చెల్లింపులు వంటివి బీమా పథకంలో కవర్ అవుతాయి. ఈ నష్టాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. యాడ్-ఆన్, డ్రైవర్ ఫీచర్ కూడా ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి. రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇది కూడా ఉపయోగపడుతుంది.

పుట్టుకతో వచ్చే వ్యాధి వల్ల పెళ్లి క్యాన్సిల్ అయినా, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కిడ్నాప్ జరిగినా, లేక ఆత్మహత్య చేసుకున్నా ఈ వివాహ బీమా చెల్లదు. పెళ్లి వేడుకపై ఉగ్రవాదుల దాడి చేసినా, పెళ్లి మండపంలో రెండు వర్గాల వారు కొట్టుకుని గాయపడినా ఈ పాలసీ చెల్లదు. అనేక పెద్ద సంస్థలు ఈ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తున్నాయి. బజాజ్, ఐసిఐసిఐ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వివాహ బీమా పాలసీలను అందిస్తున్నాయి.

click me!