union budget 2022: భారతదేశ ఆర్థిక పునరుద్ధరణపై పరిశ్రమ లీడర్లు నమ్మకంగా ఉన్నారు.. సర్వే రిపోర్ట్ వెల్లడి

First Published Jan 15, 2022, 7:21 AM IST

న్యూఢిల్లీ: కోవిడ్-19 కేసులు (covid-19cases)పెరుగుతున్నప్పటికీ భారతదేశ ఆర్థిక వృద్ధి(economic growth), విస్తరణపై పరిశ్రమ లీడర్లలో గణనీయమైన సానుకూలత ఉన్నందున భారతీయ వ్యాపారాలలో ఆశావాదం, విశ్వాసం ఎక్కువగా ఉందని ఒక సర్వే(survey) తెలిపింది.
 

Deloitte Touche Tohmatsu India LLP (DTTILLP) చేసిన ప్రీ-బడ్జెట్ సర్వే ప్రకారం, 10 పరిశ్రమల నుండి మొత్తం 163 ప్రతిస్పందనలను  జోడించింది, 75 శాతం కంటే ఎక్కువ మంది ప్రతివాదులు భారతదేశ ఆర్థిక వృద్ధి, విస్తరణపై సానుకూలంగా ఉన్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (rbi) ద్రవ్య విధాన చర్యలతో పాటు 'ఆత్మనిర్భర్ భారత్' చొరవ ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్దరించడానికి దోహదపడిందని 91 శాతం మంది ప్రతివాదులు (గత ఏడాది 58 శాతంతో పోలిస్తే) అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొంది. 

"2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ఈ నమ్మకాన్ని పెంచుతుందని వారు (పరిశ్రమ నాయకులు) ఆశిస్తున్నారు" అని DTTILLP ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో  యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఇంకా, 55 శాతం మంది వ్యాపార నాయకులు మౌలిక సదుపాయాల పెట్టుబడి కోసం "దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అదనపు పన్ను ప్రోత్సాహకాలను అందించడం" దేశంలో వృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నారు.
 

దీనికి అదనంగా, 45 శాతం మంది ప్రతివాదులు పెరిగిన R&D వ్యయానికి ప్రోత్సాహకాలను ప్రకటించడంపై బడ్జెట్ దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ ఇంకా టెలికమ్యూనికేషన్ వంటి రంగాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎగుమతిలలో పోటీతత్వాన్ని పెంపొందించడం, దిగుమతుల సుంకాలను పోటీగా ఉంచడం ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అసమర్థతలను తగ్గించడం వంటివి డెలాయిట్ సర్వే ద్వారా పరిశ్రమ నాయకులు తెలియజేసిన మరికొన్ని అంచనాలు.

సర్వే ఫలితాలపై మాట్లాడుతూ డెలాయిట్ టచ్ తోమట్సు ఇండియా ఎల్‌ఎల్‌పి( Deloitte Touche Tohmatsu India LLP) పార్ట్నర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, 2021-22 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పునరుద్ధరణను సాధించింది.
 

"మౌలిక సదుపాయాల వృద్ధికి అసెట్ మానిటైజేషన్ అండ్ పిఎల్‌ఐ పథకాలు వంటి సంస్కరణల అమలుపై ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగించగలిగితే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఊపును కొనసాగిస్తుంది" అని ఆయన అన్నారు.

అంతేకాకుండా, పెరుగుతున్న స్టార్టప్ కార్యకలాపాలు, ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీలు, విధానాలతో పాటు భారతదేశంలో వ్యాపారం చేయడం సులభతరం అవుతుందని, ఫలితంగా వేగంగా ఆర్థిక పునరుద్ధరణ ఉంటుందని చాలా మంది వ్యాపార నాయకులు అంచనా వేస్తున్నారు అని సంజయ్ కుమార్ అన్నారు.
 

సర్వే ప్రకారం, 59 శాతం మంది ప్రతివాదులు వ్యాపారాన్ని నిర్వహించడానికి భారతదేశం అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారు.

డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడం, పన్ను విధానాలను సులభతరం చేయడం, ల్యాండ్ అండ్ లేబర్ చట్టాలను మెరుగుపరచడం వంటివి భారతదేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి సహాయపడతాయని పేర్కొంది.

ఆర్థిక వృద్ధి, వ్యాపారం సులభతరం చేయడం, సెల్ఫ్ రిలయంట్ రాబోయే బడ్జెట్ నుండి పరిశ్రమ అంచనాలను విశ్లేషించడం ఈ సర్వే లక్ష్యం అని DTTILLP తెలిపింది. 

click me!