భారతదేశాన్ని మార్చిన ఈ 5 బడ్జెట్లను నేటికీ దేశ ప్రజలు మర్చిపోలేరు.. అవేంటో తెలుసుకొండి..

First Published | Jan 26, 2021, 2:09 PM IST

భారతదేశంలో ప్రతి సంవత్సరం యూనియన్  బడ్జెట్ ను ఫిబ్రవరిలో సమర్పిస్తారు. అయితే స్వాతంత్ర్యం తరువాత కొన్ని అరుదైన బడ్జెట్లను  సమర్పించారు, వీటిని ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇలాంటి బడ్జెట్లను   ఇప్పటివరకు 5 మాత్రమే ఉన్నాయి, అయితే ఇవి కొన్ని కారణాల వల్ల మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోయేల చేసాయి. ఈ బడ్జెట్లలో  కొన్నిటిని  బ్లాక్ బడ్జెట్, జెనరస్ ​​బడ్జెట్, రోల్ బ్యాక్ బడ్జెట్  అని పిలుస్తారు.

లిబరైలేజేషన్ బడ్జెట్1991లో మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ సమర్పించిన లిబరైజేషన్ బడ్జెట్ అందరికీ చాలా గుర్తుండిపోయింది. ఆ సమయంలో, మన్మోహన్ సింగ్ దేశంలో వ్యాపారం చేయడానికి విదేశీ సంస్థలకు బహిరంగ మినహాయింపు ఇచ్చారు. అప్పటి నుండి దేశంలో లిబరైజేషన్ యుగం ప్రారంభమైంది. భారతీయ కంపెనీలు కూడా బయటి దేశాలలో వ్యాపారం చేయడానికి సులభం చేసింది. కస్టమ్ డ్యూటీని కూడా 220 శాతం నుంచి 150 శాతానికి తగ్గించారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు దశాబ్దాల తరువాత, భారతదేశ జిడిపి విజృంభించింది.
undefined
బ్లాక్ బడ్జెట్1973-74లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించిన బడ్జెట్‌ను బ్లాక్ బడ్జెట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ సమయంలో 550 కోట్లకు పైగా నష్టం జరిగింది. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్‌ను రూ .56 కోట్లకు జాతీయం చేశారు.
undefined

Latest Videos


డ్రీం బడ్జెట్1997 లో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సమర్పించిన బడ్జెట్‌ను డ్రీం బడ్జెట్ అని కూడా అంటారు. అప్పుడు ఆర్థిక మంత్రి ఆదాయపు పన్ను, కంపెనీల పన్నును తగ్గిస్తునట్లు ప్రకటించారు. ఆదాయపు పన్ను రేట్లను 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. అదే సమయంలో సర్‌చార్జి కూడా రద్దు చేయబడింది.
undefined
మిలీనియం బడ్జెట్2000 సంవత్సరంలో యశ్వంత్ సిన్హా సమర్పించిన బడ్జెట్‌ను మిలీనియం బడ్జెట్ అని అంటారు. ఈ బడ్జెట్‌లో భారతదేశ ఐటీ కంపెనీలకు చాలా రాయితీలు ప్రకటించారు. కంప్యూటర్లు, సిడి ర్యామ్ లు వంటి 21 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ప్రకటించారు.
undefined
రోల్‌బ్యాక్ బడ్జెట్2002లో యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రోల్‌బ్యాక్ బడ్జెట్ అని కూడా అంటారు. ఈ బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు వంటి సేవా పన్ను, ఎల్‌పిజి సిలిండర్ ధరలు పెంపు చేశారు. సాధారణ ప్రజల నుండి, ప్రతిపక్షాల వ్యతిరేకత కారణంగా దీనిని ఉపసంహరించుకోవలసి వచ్చింది.
undefined
click me!