ఎక్కువ రిస్క్ లేకుండా ఈ వ్యాపారం చేస్తూ నెలకు లక్షలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు..

First Published | Nov 30, 2023, 10:58 AM IST

ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం తర్వాత కాగితంతో తయారైన వస్తువులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో పేపర్ ప్లేట్, గ్లాస్, పేపర్ బ్యాగ్ వంటి ఎన్నో వస్తువులను చూడవచ్చు. ఇంట్లో ఆరుగురు లేదా ఏడుగురు ఉన్నప్పటికీ పెళ్లిళ్లకు, పుట్టినరోజు వేడుకలకు, పిక్నిక్‌లకు ఈ పేపర్ ప్లేట్‌నే ఉపయోగిస్తాం. 

పర్యావరణానికి హాని కలగని, నిత్యం డిమాండ్ ఉండే ఈ పరిశ్రమ ఎంతో మందికి ఆదాయాన్ని తెస్తుంది. ఇంట్లో చిన్న వ్యాపారం చేయాలనుకునే వారి నుంచి, పెద్ద ఎత్తున వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు కూడా పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాల్లో ఇదొకటి.

పేపర్ ప్లేట్లు తయారు చేస్తూ జీవనం సాగించే వారు మన దగ్గర చాలా మంది ఉన్నారు. వీరిలో జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన విక్కీ కూడా ఉన్నాడు. విక్కీ పేపర్ ప్లేట్ వ్యాపారం ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న విక్కీ మొదట్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేశాడు. తర్వాత గట్టి నిర్ణయం తీసుకుని పేపర్ ప్లేట్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. నాలుగు మెషీన్లు, వైరింగ్, ముడిసరుకులతో సహా దాదాపు 5 లక్షల రూపాయలు వెచ్చించి ఫ్యాక్టరీని ప్రారంభించాడు. 
 

Latest Videos


ఇప్పుడు నలుగురితో విక్కీ ఒక చిన్న ఫ్యాక్టరీలో ప్రతిరోజూ 20 వేలకు పైగా పేపర్ ప్లేట్లను తయారు చేస్తున్నాడు. దీని ద్వారా నెలకు లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నాడు. మీరు కూడా ఇతని లాగా పేపర్ ప్లేట్ తయారీని ప్రారంభించి మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
 

పేపర్ ప్లేట్ తయారీకి కావల్సిన మెటీరియల్స్: బెస్ట్ క్వాలిటీ ప్రింటెడ్ పీఈ  కోటెడ్ పేపర్ కొనుగోలు చేయాలి. కిలో రూ.30 నుంచి 40 వరకు లభిస్తోంది. బాటమ్ రీల్  కిలో రూ.40. మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేయాలి. ముడి సరుకులు ఒకేసారి ఎక్కువగా కొనుగోలు చేస్తే ధర తగ్గుతుంది. దీనికి అవసరమైన మెషీన్స్  భారతదేశం అంతటా అందుబాటులో ఉన్నాయి. మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తుంటే, చిన్న మెషీన్స్  కొనండి. రూ.9,000 నుంచి రూ.25,000 వరకు హ్యాండ్ ట్రెడ్ మిల్స్ అందుబాటులో ఉన్నాయి. సింగిల్ డై ఆటోమేటిక్ మెషిన్ రూ.30,000 నుంచి ప్రారంభమవుతుంది. డబుల్ డై పేపర్ ప్లేట్ మేకర్ మెషిన్ ధర కనీసం 55,000 రూపాయలు ఉంటుంది.

ఈ వ్యాపారం చాలా లాభదాయకమైన వ్యాపారం. కాబట్టి, దీనికి కొన్ని అవసరమైన లైసెన్స్‌లు ఇంకా ప్రభుత్వ అనుమతులు అవసరం. వ్యాపారం చిన్న స్థాయిలో జరిగినా స్థానిక అధికారుల అనుమతి తీసుకోవడం మంచిది. మీరు స్థానిక దుకాణాలకు విక్రయించవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉన్నందున, మీరు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. 
 

click me!