90వ దశకం ప్రారంభంలో ఎయిర్ టికెటింగ్ ఏజెంట్‌గా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత ఒక ఎయిర్ లైన్స్ యజమానిగా మారిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన మరెవరో కాదు జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్. భారతదేశంలో ఒకప్పుడు కేవలం ప్రభుత్వ విమానయాన సర్వీసు ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రమే ఉన్న రోజులవి. ఆ సమయంలోనే విమానయాన రంగంలోకి ప్రవేశించి 'ది జాయ్ ఆఫ్ ఫ్లయింగ్' అనే ట్యాగ్ లైన్‌తో నరేష్ గోయల్ జెట్ ఎయిర్‌వేస్‌ను ప్రారంభించగా, జెట్ ఎయిర్‌వేస్‌లో ఒకప్పుడు 100 కంటే ఎక్కువ విమానాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం కంపెనీ మూసివేసే సమయానికి కేవలం 16 విమానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కంపెనీ నష్టం రూ.5535.75 కోట్లకు చేరుకుంది.