ఈ రోజుల్లో బ్యాంక్ ఎకౌంట్ లేని వాళ్లు ఎవరూ ఉండరేమో. దాదాపు అందరికీ సేవింగ్స్ ఏకౌంట్ ఉంటుంది. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడానికి, డిజిటల్ లావేదేవీలు చేయడానికి కూడా బ్యాంక్ ఎకౌంట్ తప్పనిసరి అయిపోయింది. ఇక.. భారత దేశంలో బ్యాంక్ అకౌంట్ తెరవడానికి ఎవరికీ ఎలాంటి అడ్డంకులు లేవు. దీని వల్ల ప్రతి ఒక్కరూ రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఎకౌంట్లు ఉన్నవారు కూడా ఉన్నారు. ఇక.. చాలా మంది తమ డబ్బును సేవింగ్స్ ఎకౌంట్ లో దాచుకుంటూ ఉంటారు. ఇలా దాచుకోవడం వల్ల మనకు వడ్డీ కూడా వస్తుంది. జీరో బ్యాలెన్స్ ఎకౌంట్స్ తప్పించి.. ఇతర అన్ని అకౌంట్స్ లోనూ మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిందే.
ఆదాయపు పన్ను శాఖ
అలా మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ ఫైన్ విధించే అవకాశం కూడా ఉంది. కానీ.. సేవింగ్ ఎకౌంట్ లో ఎంత డబ్బు దాచుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. నిబంధనల ప్రకారం మీ సేవింగ్స్ అకౌంట్ లో ఎంత డబ్బు అయినా ఉంచుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. కానీ మీ అకౌంట్ లో డిపాజిట్ చేసిన మొత్తం ఎక్కువగా ఉండి, ఆదాయ పన్ను పరిధిలోకి వస్తే.. ఆ ఆదాయానికి మూలం చెప్పాలి. బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి డబ్బు డిపాజిట్ చేయడానికి, డబ్బు విత్ డ్రా చేయడానికి పరిమితి ఉంది.
పన్ను నోటీసు
చెక్కు లేదా ఆన్‌లైన్ ద్వారా, సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1 నుండి వేలు, లక్షలు, కోట్ల వరకు ఏ మొత్తాన్నైనా డిపాజిట్ చేయవచ్చు. 50,000 లేదా అంతకంటే ఎక్కువ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తే, దానితో పాటు మీ పాన్ నంబర్ కూడా ఇవ్వాలి అని నిబంధన చెబుతోంది. ఒక రోజులో రూ.1 లక్ష వరకు నగదు డిపాజిట్ చేయవచ్చు. మీరు మీ అకౌంట్‌లో నిరంతరం డబ్బు డిపాజిట్ చేయకపోతే, ఈ పరిమితి రూ.2.50 లక్షల వరకు ఉండవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి తన అకౌంట్‌లో గరిష్టంగా రూ.10 లక్షల వరకు నగదు డిపాజిట్ చేయవచ్చు.
నగదు లావాదేవీ
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఈ పరిమితి మొత్తం మీద ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు పైగా నగదు డిపాజిట్ చేస్తే, దాని గురించి బ్యాంక్ ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. అలాంటప్పుడు, ఆ ఆదాయానికి మూలం ఆ వ్యక్తి చెప్పాలి. ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఆ వ్యక్తి సంతృప్తికరమైన సమాచారం ఇవ్వలేకపోతే, అతను ఆదాయపు పన్ను శాఖ రాడార్‌లోకి వచ్చి విచారణ ఎదుర్కోవచ్చు. దొరికితే భారీ జరిమానా విధిస్తారు. ఆదాయ మూలాన్ని ఆ వ్యక్తి వెల్లడించకపోతే, డిపాజిట్ చేసిన మొత్తానికి 60 శాతం పన్ను చెల్లించాలి.
ఆదాయపు పన్ను చట్టం
అదనంగా 25 శాతం సర్‌చార్జ్ , 4 శాతం సెస్ విధిస్తారు. అయితే, 10 లక్షలకు పైగా నగదు లావాదేవీ చేయలేము అని కాదు. ఈ ఆదాయానికి మూలం మీ దగ్గర ఉంటే, మీరు చింతించకుండా డబ్బు డిపాజిట్ చేయవచ్చు. అయితే, మీ సేవింగ్స్ అకౌంట్‌లో ఇంత డబ్బు ఉంచే బదులు, ఆ మొత్తాన్ని FDగా మార్చడం లేదా మరెక్కడైనా పెట్టుబడి పెట్టడం మంచిది, అక్కడ మీకు మంచి రాబడి వస్తుంది.