Petrol-Diesel Rate : గుడ్ న్యూస్..లీటర్ పెట్రోల్ ధర రూ. 75, డీజిల్ ధర రూ. 68కు పడిపోయే అవకాశం..కారణం ఇదే

First Published | Sep 6, 2023, 3:20 PM IST

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 200 రూపాయలు తగ్గించింది దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది.  అయితే ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలను కూడా భారీగా తగ్గించాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తెచ్చే విషయమై ఇప్పటికే చర్చ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 
 

గతంలో GST పరిధిలోకి  పెట్రోల్-డీజిల్ ను తెచ్చేందుకు పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి  గత ఏడాది నవంబర్లో  పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రాలు అంగీకరిస్తే, పెట్రోల్ ,  డీజిల్‌ను వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పాలనలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను  GST పరిధిలోకి వస్తే దాని ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం. 

దేశీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్‌ వస్తుంది. జీఎస్టీ పరిధిలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. అయితే, పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలపై పరోక్ష పన్ను రేట్లను నిర్ణయించే హక్కును తీసివేయడం వల్ల దీనిని జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు విముఖత చూపుతున్నాయి.
 


పెట్రోలియం ఉత్పత్తుల నుండి కేంద్రం, రాష్ట్రాలు రెండూ భారీ మొత్తంలో పన్నును ఆర్జిస్తున్నాయి. 2021-22లో ఈ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం విధించడం ద్వారా కేంద్రం రూ.3.63 లక్షల కోట్లు వసూలు చేసింది. ఈ ఉత్పత్తులపై వ్యాట్/అమ్మకపు పన్ను ద్వారా రాష్ట్రాలు రూ.2.56 లక్షల కోట్లు ఆర్జించాయి. పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తీసుకువస్తే, రాష్ట్రాలు తమ ఆదాయ అవసరాలకు అనుగుణంగా అమ్మకపు పన్ను లేదా వ్యాట్ రేట్లను సర్దుబాటు చేసుకునే సౌకర్యాన్ని కోల్పోతాయి.

GSTని తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు
పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తీసుకురావడం వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల అనేక రంగాలపై పెను ప్రభావం చూపుతుందని, ఇది అంతిమంగా సామాన్య ప్రజలను, ముఖ్యంగా పేదలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

పెట్రోలియం ఉత్పత్తులను GSTలోకి తీసుకురావడం వల్ల క్యాస్కేడింగ్ ప్రభావం తగ్గుతుంది. కంపెనీలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని పొందవచ్చు. చివరికి మార్కెట్లో ధరలు తగ్గుతాయని ప్రజల  కొనుగోలు శక్తి కూడా పెరగడం వల్ల,  ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని,  అంచనా వేస్తున్నారు. 

గత ఏడాది సెప్టెంబర్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ 45వ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై చర్చించారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి రాకుండా కొనసాగించాలని కౌన్సిల్ నిర్ణయించింది. 

నిజానికి పెట్రోలు, డీజిల్ ధరల్లో దాదాపు 50శాతం పైగా పన్నులే  ఉంటాయి. ఉదాహరణకు పెట్రోలు ధర లీటరుకు 100 రూపాయలు ఉంటే, అందులో 50 శాతం ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.  ఈ పన్నులు భారీగా ఉండటం వల్ల ప్రభుత్వ ఖజానా పెరుగుతోంది.

పెట్రోల్-డీజిల్ ఎంత చౌకగా మారుతుంది?
వాస్తవానికి పెట్రోల్ ,  డీజిల్ ధరలలో 46 శాతం వరకు పన్నులు ఉంటాయి.  ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి వస్తే అత్యధిక శ్లాబ్‌ 28 శాతం పన్ను విధించినప్పటికీ, పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుత ధర కన్నా భారీగా తగ్గే అవకాశం ఉంది. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే పెట్రోల్ లీటరుకు రూ.75, డీజిల్ లీటరుకు రూ.68 వరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 

Latest Videos

click me!