డ్రైఫ్రూట్స్ లో అందరికీ ఇష్టమైనటువంటి, పండు ఏదైనా ఉందంటే అది ఖర్జూరం అనే చెప్పాలి. ఖర్జూర పంట ఎక్కువగా అరబ్ దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పంటను మన దేశంలో కూడా విజయవంతంగా సాగు చేస్తున్నారు. తద్వారా దేశీయంగానే ఖర్జూర పంటకు ఉన్న డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి ఇక్కడ లభిస్తోంది.
మొత్తం మార్కెట్ లోనే ఉత్పత్తి అయ్యే 38 శాతం ఖర్జూర పంటను భారతదేశమే దిగుమతి చేసుకుంటుంది. అంటే ఖర్జూర పంటకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో కేవలం గుజరాత్ రాజస్థాన్ వంటి ప్రదేశాల్లోనే ఈ ఖర్జూర పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ఇటీవల శాస్త్రవేత్తలు తీసుకున్నటువంటి కొన్ని ప్రయోగాల ఫలితంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో సైతం ఖర్జూర పంట సక్సెస్ ఫుల్ గా సాగవుతోంది. దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు కూడా మనకు లభిస్తున్నాయి.
చాలామంది రైతులు ఖర్జూరం చెట్లను నాటి ఖర్జూర పంటను ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయించి మంచి ఆదాయం పొందుతున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లాలో కొంతమంది రైతులు ఖర్జూర పంటను ఉత్పత్తి చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖర్జూర పంట గురించి నిపుణులు సలహాలు అందిస్తున్నారు. . వారి నుంచి మెలకువలను నేర్చుకోవచ్చు.
ఇక ఖర్జూర పంట విషయానికి వచ్చినట్లయితే మీ వద్ద అర ఎకరం నుంచి ఒక ఎకరం స్థలం ఉన్నప్పటికీ ఈ చెట్లను రాట్టుకోవచ్చు అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్న సమాచారం ప్రకారం ఖర్జూర తోట సాగు చేయాలంటే మొదటి సంవత్సరం పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా మొక్కలు కొనడం వాటిని నాటడం డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాల్ చేయడం ఇలా ఎకరానికి దాదాపు 5 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని చెబుతున్నారు నాలుగో ఏడాది నుంచి రాబడి మొదలవుతుందని సూచిస్తున్నారు
ఎకరానికి 200 నుంచి 250 మొక్కలు నాటవచ్చని అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్నారు. ఒక్క మొక్క సుమారు 3000 రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఖర్జూర పంటకు పెద్దగా తడి అవసరం లేదు నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాల్లో కూడా పెరుగుతుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో హెక్టార్కు 2 లక్షల రూపాయల వరకు రాయితీ కూడా అందిస్తున్నట్లు చెబుతోంది ఇందుకోసం రైతులు ఉద్యాన శాఖను సంప్రదించాల్సి ఉంటుంది
మార్కెట్లో ఒక కిలో ఖర్జూరం ధర కనీసం 150 రూపాయలు ఉంటుంది. ఒకటన్ను ధర 1 లక్ష రూపాయల పైనే ఉంటుంది. ఎకరాకు కనీసం నాలుగు టన్నుల పంట వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసినట్లయితే సంవత్సరానికి కనీసం ఐదు లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం రాబడి పెరిగే అవకాశం ఉంది ఒక్కో చెట్టుకు ఏడాదికి పదివేలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.