ఫిబ్రవరి 1న బడ్జెట్2022
దేశంలోని సాధారణ పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలు అలాగే భారతీయ క్రిప్టో పెట్టుబడిదారులు బడ్జెట్ 2022పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రిప్టోకరెన్సీలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నివేదికల ప్రకారం, క్రిప్టోకరెన్సీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ పన్నుల నిపుణుల నుండి సలహాలు తీసుకుంటోంది. నిజానికి, ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి లేదా వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంపై పన్నును స్పష్టంగా నిర్వచించాలనుకుంటోంది. క్రిప్టోకరెన్సీల నుండి వచ్చే ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా లేదా మూలధన లాభంగా పరిగణించవచ్చా అని చర్చిస్తోంది.