ఆర్థిక సర్వే అంటే ఏమిటి..? బడ్జెట్ ముందు ఎందుకు ప్రవేశపెడతారో తెలుసుకోండి..

First Published | Jan 29, 2021, 5:12 PM IST

భారతదేశ ప్రధాని  నరేంద్ర మోడీ సర్కార్  ఆర్థిక సర్వే ను నేడు సమర్పించారు. ఈ నివేదిక దేశ ఆర్థిక వ్యవస్థ  ప్రస్తుత స్థితి, ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలను చూపుతుంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 ఫిబ్రవరి 1 న పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఎకనామిక్ సర్వే ప్రతి సంవత్సరం బడ్జెట్ ముందు ప్రవేశపెడతారు. ఈ సర్వే నివేదికను ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) నేతృత్వంలోని బృందం తయారు చేస్తుంది.
 

ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిడిపి -7.7 శాతంగా ఉందని 'వి-షేప్' రికవరీసర్వే తెలిపింది. అలాగే వచ్చే ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిడిపి 11 శాతం ఉంటుందని అంచనా వేసింది.
కరోనా వైరస్ మహమ్మారి 2020 మార్చి నుండి దేశంలో ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని సర్వే పేర్కొంది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కనెక్టివిటీ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగం కూడా కోవిడ్ -19 మహమ్మారి వల్ల నష్టపోయాయి అని తెలిపింది.

ఆర్థిక ఎకనామిక్ సర్వే అంటే ఏమిటి?ఎకనామిక్ సర్వే అనేది ఒక సంవత్సర ఆర్థిక వ్యవస్థ వివరణాత్మక నివేదిక, ఇందులో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సవాళ్లు, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఉంటాయి. ఈ నివేదికను ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక విభాగం ముఖ్య ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో తయారు చేస్తుంది.
మొదటి ఆర్థిక సర్వేనివేదిక సిద్ధమైన తర్వాత, దానిని ఆర్థిక మంత్రి ఆమోదిస్తారు. మొదటి ఆర్థిక సర్వే 1950–51లో ప్రవేశపెట్టారు. ఈ నివేదిక బడ్జెట్ సమయంలోనే వెల్లడిస్తారు. 1964 నుండి, ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్‌కు ఒక రోజు ముందు సర్వేలు జారీ చేస్తోంది.
ఆర్థిక సర్వే ప్రాముఖ్యత ఏమిటి?ఆర్థిక సర్వే ప్రాముఖ్యత ఏమిటంటే ఇది దేశ ఆర్థిక పరిస్థితిని చూపిస్తుంది. ఎకనామిక్ సర్వే డబ్బు సరఫరా, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి, ఉపాధి, ధరలు, ఎగుమతులు, దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, ఇతర సంబంధిత ఆర్థిక అంశాలను విశ్లేషిస్తుంది.
ఈ నివేదిక ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన నివేదిక, ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన ఆందోళనలపై కూడా దృష్టి పెడుతుంది. ఎకనామిక్ సర్వే డేటా ఇంకా విశ్లేషణ సాధారణంగా కేంద్ర బడ్జెట్‌కు విధానాన్ని అందిస్తుంది.

Latest Videos

click me!