సముద్ర గర్భంలో రైలు పరుగు.. భారత్ లోనే తొలిసారి.. ఈ బుల్లెట్ పరుగు ఎక్కడో తెలుసా?

Published : Aug 12, 2024, 11:09 PM ISTUpdated : Aug 12, 2024, 11:28 PM IST

India's first undersea train tunnel: త్వరలో సముద్ర గర్భంలో ప్రయాణించవచ్చు. అది కూడా రైలులో..  అది కూడా మ‌న భార‌త్ లోనే.. వావ్ అద్భుతంగా ఉంది కదా ఈ ప్రయాణం గురించి ఆలోచిస్తుంటే.. ! అద్భుత నిర్మాణం మ‌రిన్ని విష‌యాలు మీకోసం..   

PREV
16
సముద్ర గర్భంలో రైలు పరుగు.. భారత్ లోనే తొలిసారి.. ఈ బుల్లెట్ పరుగు ఎక్కడో తెలుసా?
under sea train tunnel, under sea train

India's first undersea train tunnel: అవును భారతదేశంలో మొట్టమొదటిసారిగా సముద్రగర్భ రైలు సొరంగం నిర్మిస్తున్నారు. అరేబియా సముద్రం కింద 7 కిలో మీట‌ర్ల పొడవున రైలు సొరంగాన్ని నిర్మించనున్నారు. ఈ సొరంగం లోపల గాలి వేగంతో రైలు నడుస్తుంది. అయితే, ఈ పని అంత సులభం కాదు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 

26
train 11

భారతీయ రైల్వేలు కాలక్రమేణా పురోగమిస్తున్నాయి. రాజధాని, శతాబ్ది, లాంగ్ డ్రైవ్ రైలు త‌ర్వాత అత్యాధునిక సాంకేతిక‌త‌తో కూడాన‌ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. కోల్‌కతాలో నది కింద మెట్రో పరుగులు తీయడం ప్రారంభించింది. భారతదేశం సముద్రగర్భంలో బుల్లెట్ రైలు టన్నెల్ ను నిర్మిస్తోంది.  దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 నాటికి బుల్లెట్ రైలు పరుగులు తీస్తుందని స‌మాచారం. ఇందుకోసం బుల్లెట్ ట్రైన్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అహ్మదాబాద్-ముంబై మధ్య నడిచే బుల్లెట్ రైలు 508 కిలోమీటర్ల ప్రయాణం భూమిపై నుంచి మాత్ర‌మే కాదు స‌ముద్ర గ‌ర్భం నుంచి కూడా ఉండ‌నుంది. దాని మార్గంలో సొరంగాలు, సముద్రం భాగం నుంచి వెళ్ల‌నుంది. 

36
Modi Bullet Train

అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు కారిడార్‌లో 21 కిలోమీటర్ల భాగం భూగర్భంలో ఉంటుంది. విశేషమేమిటంటే ఈ కారిడార్ కోసం సముద్రం కింద టన్నెల్ నిర్మిస్తున్నారు. బుల్లెట్ రైలు కోసం అరేబియా సముద్రంలో సొరంగాన్ని నిర్మిస్తున్నారు. సముద్రం కింద 7 కిలో మీట‌ర్ల పొడవైన సొరంగాన్ని సిద్ధం చేస్తున్నారు. 

46
bullet train

దేశంలోనే మొదటి సముద్రగర్భ రైల్వే సొరంగం ఇది. అరేబియా సముద్రం కింద బుల్లెట్ రైలు కోసం నిర్మిస్తున్న ఈ నీటి అడుగున సొరంగం 7 కిలోమీటర్ల పొడవు, 25 నుండి 65 మీటర్ల లోతు ఉంటుంది. ఈ సొరంగం భారతదేశపు మొదటి సముద్రగర్భ రైల్వే సొరంగం. సముద్రం కింద సొరంగం నిర్మించడం అంత సులభం కాదు. ఇందుకోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. ప్రత్యేక యంత్రాల సాయంతో సముద్రగర్భంలో టన్నెల్‌ను నిర్మించనున్నారు. 

56

సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించేందుకు ఎండ్వాస్ యంత్రాలను అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఘన్సోలీ, శిల్పాటా, విక్రోలిలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఎకనామిక్స్ టైమ్ తన నివేదికలో మూలాలను ఉటంకిస్తూ ఈ ఏడాది చివరి నాటికి బుల్లెట్ రైలు సముద్రగర్భ సొరంగం కోసం మొదటి టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) పనులు ప్రారంభమవుతాయని పేర్కొంది. సొరంగం త్రవ్వటానికి 13.1 మీటర్ల వ్యాసం కలిగిన కట్టర్ హెడ్‌తో అమర్చబడిన టన్నెల్ బోరింగ్ మెషిన్ ఉపయోగించబడుతుంది. కొత్త ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతి ద్వారా తవ్వకం జరుగుతుంది. 

 

66

సముద్రం అడుగున 7 కిలోమీటర్ల మేర సముద్రగర్భంలో సొరంగం నిర్మించడం సవాలుతో కూడుకున్నది. ఈ మార్గంలో డబుల్ లైన్‌తో సింగిల్ ట్యూబ్ టన్నెల్ నిర్మించనున్నారు, ఇందులో బుల్లెట్ రైళ్ల కదలిక కోసం రెండు ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ సొరంగంలో బుల్లెట్ రైలు వేగం గంటకు 320 కిలోమీటర్లు ఉంటుంది. భారత్‌లో సముద్రగర్భంలో టన్నెల్‌ను నిర్మించడం ఇదే తొలిసారి. సొరంగం నిర్మించేందుకు ఘన్సోలీ, శిల్పాటా, విక్రోలిలో తవ్వకాలు జరుపుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories