దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు
టాటా మోటార్స్ మే 2022లో ప్యాసింజర్ వాహన విభాగంలో 43,341 కార్లను విక్రయించింది. అంటే వార్షిక ప్రాతిపదికన అమ్మకాలలో 185 శాతం భారీ పెరుగుదల. గతేడాది ఇదే నెలలో కంపెనీ 15,181 ప్యాసింజర్ వాహనాలను డెలివరీ చేసింది.
Car Tata motors
ఎలక్ట్రిక్ వాహనల అమ్మకాలు
కంపెనీ మే 2022లో 39,887 ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది, గత ఏడాది ఇదే నెలలో 14,705 యూనిట్లు విక్రయించింది. అంటే ఏడాది ప్రాతిపదికన 171 శాతం పెరుగుదల. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 3,454 యూనిట్లుగా నమోదయ్యాయి, దీంతో 626 శాతం భారీ జంప్‌ను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో టాటా మోటార్స్ భారత మార్కెట్లో 476 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది.
టాటా మోటార్స్ కూడా ప్రతినెల విక్రయాలను 1,754 యూనిట్లతో మెరుగుపరచుకోగలిగింది, దీంతో 4 శాతం వృద్ధిని సాధించింది. బ్రాండ్ EV విక్రయాలు కూడా ప్రతినెల ప్రాతిపదికన మెరుగుపడ్డాయి. కంపెనీ మే నెలలో 3,454 EVలను విక్రయించింది, ఏప్రిల్ 2022లో 2,322 EVలను విక్రయించింది.
వాణిజ్య వాహనాల విక్రయాలు
టాటా మోటార్స్ మే 2022 నెలలో మొత్తం 32,818 వాణిజ్య వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 11,401 వాణిజ్య వాహనాలు విక్రయించబడ్డాయి. కంపెనీ అమ్మకాలలో ఏడాది ప్రాతిపదికన 188 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
దేశీయ మార్కెట్‌లో టాటా మోటార్స్ మే 2022లో 31,414 వాణిజ్య వాహనాలను విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 9,371 విక్రయించింది. దేశీయ వాణిజ్య వాహనాల విక్రయాలు 235 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే, బ్రాండ్ ఎగుమతులు 31 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ మే 2022లో 1,404 వాణిజ్య వాహనాలను ఎగుమతి చేసింది. అలాగే మే 2021లో 2,030 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి.