రూ.50వేల లోపు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్ డీల్, మిస్ చేసుకోకండి..!

First Published | Oct 28, 2024, 11:03 AM IST

పండగ వేళ మనకు  చాలా కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తూ ఉంటారు. తాజాగా ప్రముఖ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్  స్కూటర్లపై దాదాపు 50 శాతానికి పైగా డిస్కౌంట్ ప్రకటించారు. మరి, ఏ కంపెనీల  స్కూటర్లపై ఆఫర్లు ఉన్నాయో ఓసారి చూద్దాం...

ఈరోజుల్లో  చేతిలో ఒక బైక్ ఉండటం చాలా అవసరం. అయితే.. బయట ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లు చూస్తుంటే.. సామాన్యుల గుండె గుభేల్ అంటుంది.అందుకే, అందరూ ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు కొనాలని అనుకుంటున్నారు. అయితే.. వాటాి ఖరీదు కూడా కాస్త ఎక్కువగా ఉంది అని చాలా మంది వెనకంజ వేస్తున్నారు. అలాంటి వారికి ఇది కచ్చితంగా బంపర్ ఆఫర్. దీపావళి వేళ... పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించారు. దాదాపు 54శాతం తగ్గింపు ప్రకటించారు. మరి..ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లేంటో చూద్దాం..

అత్యంత చౌకగా ఎలక్ట్రిక్ స్కూటర్ పొాందాలి అనుకుంటే.. దీనిని ఎంచుకోవడం ఉత్తమం. గ్రీన్ ఇన్విక్టా కంపెనీ భాారీ తగ్గింపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తోంది. ఈ  నీలం రంగులో లభించే గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 25 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఒక గంట చార్జింగ్‌తో 60 గంటల వరకు నడుస్తుంది.


గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్

పూర్తిగా చార్జ్ కావడానికి 4 నుండి 6 గంటలు పడుతుంది. రిమోట్ కంట్రోల్, ఎల్‌సిడి మోటార్, బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ దీపావళి ఆఫర్‌లో 53% తగ్గింపుతో లభిస్తుంది.

ఏఎంఓ ఎలక్ట్రిక్ బైక్

ఏఎంఓ ఇన్స్పైర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎరుపు రంగులో అందమైన డిజైన్‌తో లభిస్తుంది. పోర్టబుల్ చార్జర్‌తో వస్తుంది. తెలుపు, బూడిద రంగుల్లో కూడా లభిస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఈ స్కూటర్ మీకు అద్భుతమైన రైడింగ్ అనుభూతిని, భద్రతను అందిస్తుంది. అమెజాన్ దీపావళి ఆఫర్‌లో లభించే ఈ స్కూటర్ చాలా తేలికైనది. సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఉంది.

Latest Videos

click me!