today astrology:31 మార్చి 2020 మంగళవారం రాశిఫలాలు

First Published | Mar 31, 2020, 7:25 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. సంఘంలో గౌరవం తగ్గే సూచనలు. కీర్తి ప్రతిష్టలకై ఆలోచనలు పెరుగుతాయి. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విద్యార్థులకు విద్యపై ఆసక్తి తగ్గుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఒత్తిడికి లోనవుతారు. పరిశోధకులకు కొంత అసౌకర్యాలు కలిగే సూచనలు. ఏ పనిచేసినా ఆచి, తూచి వ్యవహరించాలి. మొత్తంపైన సంతృప్తి తక్కువగా ఉంటుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. పరామర్శలు చేసే సూచనలు కనబడుతున్నాయి. వైద్యసేవలకు ప్రాధాన్యం ఇవ్వండి. అనవసర ఖర్చులు చేసే సూచనలు. ప్రమాదాలకు అవకాశం కనిపిస్తుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాలు అనుకూలించవు. నూతన పరిచయస్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. భాగస్వాములతో జాగ్రత్తగా మెలగడం మంచిది. వ్యాపారస్తులు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అననుకూల వాతావరణం ఏర్పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకై అధిక ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపుకోసం ఆరాట పడతారు. అప్పుల బాధలు తీవ్రమౌతాయి. అంతః శ్రతువులపై విజయం సాధించే ప్రయత్నం చేస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : క్రియేటివిటీ తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. తీసుకునే నిర్ణయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సంతాన సమస్యలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులకు కొంత ఒత్తిడి కలుగుతుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల సంతోషం తగ్గుతుంది. ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆహారంలో సమయపాలన మంచిది. తల్లితో అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సాఫ్ట్ భోజనం మాత్రమే చేయాలి. ఘాటు పదార్థాలు తీసుకోకూడదు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సోదరవర్గీయులతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్స్ వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. ప్రయాణాలలో ఆచి, తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే ఒత్తిడికి గురి చేస్తాయి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాటల వల్ల తొందరపాటు పనికిరాదు. కుటుంబంలో అననుకూలత పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు పనికిరావు. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే సూచనలు. దాన ధర్మాలు అధికంగా చేయడం మంచిది. వాక్ చాతుర్యం తగ్గుతుంది. మౌనంగా ఉండడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం అవుతుంది. శ్రమకు తగిన గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. ప్రణాళికలు పనులకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. తొందరపాటు పనికిరాదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పాదాల నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రమాదాలకు ఆస్కారం కనిపిస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. లాభాలు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన లాభాలు వస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతోషకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. పనులలో తొందరపాటు పనికిరాదు.

Latest Videos

click me!