ఆడవాళ్లు శనివారం తలస్నానం చేయొద్దా?

First Published | Mar 2, 2024, 9:40 AM IST

ఏ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదన్న ఎన్నో విషయాలు మత గ్రంధాల్లో ఉంటాయి. కొంతమంది వీటిని ఖచ్చితంగా పాటిస్తే మరికొంతమంది మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోరు. మత విశ్వాసాల ప్రకారం.. శనివారం నాడు తలస్నానం చేయకూడదు. ఒకవేళ తలస్నానం చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదంది. 
 

ఆయుష్షు తగ్గుతుంది

పురాణాల ప్రకారం.. శనివారం నాడు ఆడవాళ్లు తలస్నానం చేస్తే ఆయుష్షు తగ్గుతుంది. అందుకే చాలా మంది ఆడవారు శనివారం రోజున మహిళలు ఈ రోజున జుట్టును కడగకూడదు.

శనిదేవుడికి కోపం

శనివారం నాడు ఆడవాళ్లు తలస్నానం చేయడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుందని కూడా నమ్ముతారు. అందుకే శనివారం నాడు తలస్నానం చేయకూడదని జ్యోతిష్యులు చెప్తారు. 
 

ఆర్థిక ఇబ్బందులు

శాస్త్రాల ప్రకారం.. మీరు ఇప్పటికే డబ్బుకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతుంటే.. శనివారం నాడు పొరపాటున కూడా తలస్నానం చేయకండి. ఒకవేళ ఈ రోజు మీరు తలస్నానం చేస్తే మీరు మరిన్ని ఆర్థిక ఇబ్బందును ఎదుర్కోవాల్సి వస్తుంది. 


bath

తమ్ముడి వయసు తగ్గుతుంది

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శనివారం నాడు తలస్నానం చేయడం తమ్ముడికి కూడా మంచిది కాదు. దీనివల్ల మీ అన్నదమ్ముల వయసు తగ్గే అవకాశం ఉంది. 

దురదృష్టవంతులు

మత విశ్వాసాల ప్రకారం.. శనివారం నాడు తలస్నానం చేయడం అస్సలు మంచిది కాదు. దీన్ని అశుభంగా భావిస్తారు. ఈ రోజు తలస్నానం చేస్తే చెడు జరుగుతుందని నమ్ముతారు. 
 

గురువారం నాడు 

మత విశ్వాసాల ప్రకారం.. గురువారం నాడు కూడా తలస్నానం చేయకూడదు. ఒకవేళ మీరు గురువారం నాడు తలస్నానం చేస్తే మీ ఇంట్లో సుఖశాంతులు కరువవుతాయి. ఇంట్లో అన్నీ సమస్యలు వస్తాయి. 

మంగళవారం నాడు 

జ్యోతిష విశ్వాసాల ప్రకారం.. మంగళవారం నాడు కూడా ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు. ఒకవేళ మీరు ఈ రోజు తలస్నానం చేస్తే మీ భర్త జీవితంపై చెడు ప్రభావం పడుతుంది.
 

Latest Videos

click me!