ఏపీ రాజధాని: అమరావతిని చీకి పాతరేసిన వైఎస్ జగన్

First Published | Dec 18, 2019, 5:15 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసిపి ప్రభుత్వం పరోక్షంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. తాజాగా సీఎం జగన్ వ్యాఖ్యలు అమరావతి భవిష్యత్ ను సందిగ్దంలోకి  నెట్టింది. ఈ నేపథ్యంలో అధికారాన్ని చేపట్టినప్పటి నుండి జగన్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఓసారి పరిశీలిద్దాం.  

ఆంధ్రప్రదేశ్ రాజధానిపైనే ఎప్పటి నుంచో సందిగ్ధత నెలకొని ఉన్న విషయం మనకు తెలిసిందే. అధికారంలోకి వచ్చింది మొదలు అమరావతిపై జగన్ ప్రభుత్వం శీతకన్ను వేసిందనేది వాస్తవం. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను బట్టి చూసినా... బడ్జెట్ లో అమరావతికి చేసిన కేటాయింపులు చూసినా మనకు ఇదే అర్థమవుతుంది.  అధికారంలోకి వచ్చినాకనే కాదు,ప్రతిపక్షంలో ఉన్నప్పడు నుంచే వైసీపీ పార్టీ అమరావతిపై అనేక ఆరోపణలు చేసింది. శివారామకృష్ణ కమిటి సిఫార్సులను తుంగలో తొక్కారు నుంచి మొదలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జారిందనే ఆరోపణల వరకు జగన్ పార్టీ అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూనే ఉంది.
undefined
ఇటీవల కొన్ని నెలల కిందటి పరిణామాలను గనుక తీసుకుంటే, అమరావతి రాజధానిగానే ఉంటుంది కానీ భారీస్థాయిలో ఉంటుందని...ఇంకో రెండు ప్రాంతీయ బోర్డులను జగన్ ఏర్పాటు చేస్తాడని అంతా భావించారు. కాకపోతే ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ అమరావతి మీద మాట మర్చి అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అన్నారో మరో మారు రాజధానిపై నీలి నీడలు ఏర్పడ్డాయి.  ఇక నిన్న జగన్ అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అని అన్నారు. ఇక అప్పటి నుండి మొదలు. అమరావతి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని మరీ నిరసనలకు దిగారు.
undefined

Latest Videos


ఈ నేపథ్యంలో అసలు ఇలా మూడు రాజధానుల వెనుక ప్రభుత్వ ఆలోచనలు ఏంటి? ప్రభుత్వం ఇలా ప్రకటన చేయడానికి వెల్లడించిన కారణాలేంటి? ఈ నిర్ణయం సహేతుకమైనదేనా అనే విషయాన్ని తెలుసుకుందాము.
undefined
జగన్ నిన్న అసెంబ్లీలోమాట్లాడుతూ శాసన నిర్వాహక రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం,జ్యూడిషియల్ రాజధానిగా కర్నూల్ ఉంటాయని అన్నారు.  అమరావతి నుంచి పాక్షికంగా రాజధానిని తరలించడానికి ప్రభుత్వం చెప్పిన కారణాలు...   ప్రభుత్వం మొదటగా మాట్లాడింది అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి. రాజధాని ప్రాంతంలో టీడీపీకి సంబంధించిన ఎందరో ముఖ్యనేతలు, వారి తరఫు బంధువులు... ఒకరకంగా ప్రస్తుత ప్రభుత్వ పరిభాహ్స్లో చెప్పాలంటే టీడీపీ నేతల బినామీలు అత్యధికంగా భూములు కొన్నారని వారు వాదిస్తున్నారు.  2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు ప్రభుత్వం రాజధాని ఎక్కడా అనేది చెప్పకుండా తాత్సారం చేసిందని ఈ సమయంలో రాజధాని విజయవాడ సమీపంలో రాబోతుందన్న ముందస్తు సమాచారంతో భారీ స్థాయిలో భూములు కొన్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
undefined
టీడీపీ నేతలకు, వారికి సంబంధించిన వ్యక్తులకు ఒక్కొక్కరికి ఎంతెంత భూములు ఉన్నాయో లెక్కలతోసహా నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి బుగ్గన. ఒకవేళ ఈ లెక్కలు నిజమే అయితే... వాస్తవంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే వీరందరిపై విచారణకు ఆదేశించి నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప నేతలు చేసిన పాపానికి ప్రజలను శిక్షించటం సబబేనా చెప్పండి.  ఇక 3 రాజధానులపై మాట్లాడుతూ... ప్రభుత్వం దక్షిణాఫ్రికాకు కూడా మూడు రాజధానులు ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటె తప్పేంటని వాదించింది. వాస్తవానికి దక్షిణాఫ్రికా పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు.
undefined
దక్షిణాఫ్రికా ఒక దేశంగా ఏర్పడేటప్పుడు అది ఒక సమాఖ్యలాగా కాకుండా యూనిటరీ పద్దతిలో ఏర్పడింది. ఇలా ఏర్పడటం వల్ల అప్పటి నాలుగు ప్రధాన ప్రోవిన్సులైన కేప్ ప్రావిన్స్,నాటల్,ఆరంజ్ రివర్, ట్రాన్స్వాల్ లు తమ హక్కుల పరిరక్షణ కోసం పట్టుబడితే ఇలా 3రాజధానుల ఫార్ములాను తెరమీదకు తీసుకువచ్చారు.  అంతే కాకుండా ప్రేటోరియా ఏదైతే కార్యనిర్వాహక రాజధానిగా కొనసాగుతుందో, దాన్ని జాతి వివక్ష పాలనకు చిహ్నంగా చూసేవారు. దక్షిణాఫ్రికాలో ఎప్పుడైతే ఈ వివక్ష అంతమైందో దానికి సంబంధించిన ఆనవాళ్లను కూడా తుడిచిపెట్టేసే పనిలో భాగంగా ఇలా రాజధానులను ఏర్పాటు చేయడం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ కి కూడా ఎమన్నా ఇలాంటి చరిత్ర ఉందా? ఆంధ్రప్రదేశ్ లో జాతి దురహంకార చిహ్నంగా అమరావతి వెలుగొందిందా? అవి ఏవి కానప్పుడు ఈ విధంగా చేయవలిసిన అవసరం ఏమి వచ్చింది.  ఇక ప్రభుత్వం చెప్పిన మూడవ వాదన...వికేంద్రీకరణ. పాలనాపరమైన వికేంద్రీకరణలో భాగంగా ఇలా 3 రాజధానుల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీన్ని సపోర్ట్ చేస్తూ, హైదరాబాద్ ఉదాహరణ చెప్పారు మంత్రి ధర్మాన ప్రసాద రావు.
undefined
ధర్మాన మాట్లాడుతూ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ప్రజలు అత్యధికంగా బాధపడింది హైదరాబాద్ లాంటి రాజధానిని కోల్పోవడమే అని ఆయన అన్నారు. అక్కడ అంతా కేంద్రీకృతమై ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు కట్టుబట్టలతో వచేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.  ఇక్కడ ధర్మాన గారు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. హైదరాబాద్ లో శాసనపరమైన, కార్యనిర్వాహక రాజధాని ఉండడం వల్ల ఎవరూ అడ్డు చెప్పలేదు. అందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి కారణం ఇక్కడ అభివృద్ధి కేంద్రీకృతమై ఉండడం.  అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్ వదులుకోవడానికి సిద్ధపడలేదు తప్ప ఇక్కడున్న ఏదో అసెంబ్లీ భవనాన్నో...లేదా సెక్రటేరియట్ భవనాన్నో వదిలివెళుతున్నందుకు బాధ పడలేదు.
undefined
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వికేంద్రీకరణ జరగాల్సింది అభివృద్ధిలో తప్ప ప్రభుత్వ పరిపాలనా శాఖల్లో కాదు. అభివృద్ధి అంతా రాష్ట్రమంతటా విస్తరిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది తప్ప... ఒక జిల్లాలో అసెంబ్లీ, మరో జిల్లాలో సచివాలయం, మరో జిల్లాలో శాసన మండలి ఇలా ఉంటె కాదు.  ఇలాంటి పనుల వల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుంది. ఇప్పుడు అమరావతికి తోడుగా మరోచోట మొత్తం భావనాలన్నింటిని నిర్మించాలి. పూర్తిస్థాయిలో అక్కడ మౌలికవసతులు ఏర్పాటు చేయాలి. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంపై అది ఒక అదనపు భారం.  అంతేకాకుండా ఇలా శాసనావిధానపరమైన రాజధానిని, కార్యనిర్వహణ రాజధానిని వేరుగా చేస్తే అది మన వ్యవస్థకు సూట్ అవదు. దక్షిణాఫ్రికాలో అంటే అధ్యక్షా తరహా పాలనా కాబట్టి సరిపోయింది. ఇక్కడ పద్ధతి అది కాదు కదా. ఇక్కడ శాసనపరమైన నిర్ణయాలు తీసుకునే ఎమ్మెల్యేలే కార్యనిర్వహణ చేసేది. ఎమ్మెల్యేలే కదా మంత్రులయ్యేది.  ఉదాహరణకు అమెరికాలాంటి అధ్యక్షా తరహా పాలనలో అక్కడ మంత్రులు వేరు కాంగ్రెస్ సభ్యులు వేరు. కాబట్టి అధ్యక్ష తరహా పాలనలో అది సరిపోతుంది. ఇక్కడ అలా  కాదు. అసెంబ్లీ ఉన్నరోజు అసెంబ్లీకి హాజరయ్యి సదరు మంత్రిగారు వెంటనే అదేరోజు మల్లి తిరిగి విశాఖపట్నానికి వెళ్తారా? లేదు అంటే అసెంబ్లీ ఉన్న రోజు సెక్రటేరియట్ అంతా అమరావతికి రావలిసి ఉంటుంది. ఈ చర్యలవల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడడంతప్ప ఒరిగేదేమీ లేదు.
undefined
ఇక నిజంగా వికేంద్రీకరణ జరపాలనే కోరిక ఉంటె ఎందుకు విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధానిని తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరం, పారిశ్రామికీకరణ చెందిన నగరం ఏదన్నా ఉందంటే అది విశాఖపట్నం మాత్రమే. ఇప్పటికే అంతలా అభివృద్ధి చెందిన వైజాగ్ నగరంలో ఇలా రాజధానిని ఏర్పాటు చేస్తే అభివృద్ధి మరింత కేంద్రీకృతమవ్వదా చెప్పండి
undefined
ప్రాంతీయ వైషమ్యాలు మరింత పెరిగే ఆస్కారం...  రాజధాని విషయంలో మొదలైన వివాదం ఇప్పటికే ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టేవిధంగా నిన్నటి నుండి జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. అమరావతి రైతులు, ప్రజలు రాజధాని తరలి పోకూడదు అని నిరసనలు తెలుపుతుంటే... రాయలసీమ ప్రాంత వాసులు మాత్రం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే తాము మరింతగా నష్టపోతామని వాదిస్తున్నారు.  ఇక ఉత్తరాంధ్రవాసులు ఏమో తాము హై కోర్టుకు వెళ్లాలంటే రాయలసీమ వరకు వెళ్లాలని, చాలా దూరం అవుతుందని అంటున్నారు. కర్నూల్ లో హై కోర్టుని నెల్లూరు జిల్లా లాయర్లు కూడా స్వాగతించడంలేదు.
undefined
ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని రాజధానులు కట్టి డబ్బు వృధా చేసే బదులు అమరావతినే చంద్రబాబు చెప్పినట్టు సింగపూర్ స్థాయిలో కాకున్నా... కనీసం పరిపాలనా సౌలభ్యం కలిగించగలిగే ఒక మామూలు రాజధానిని అయినా నిర్మిస్తే అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇలాంటి వికేంద్రీకరణ జరిపే బదులు అభివృద్ధిని జరిపితే ప్రజలు ఆ అభివృద్ధి ఫలాలు ఆనందంగా అందుకుంటారు తప్ప ఇలా పరిపాలనను వివిధ ప్రాంతాలకి మార్చడంవల్ల డబ్బుతోపాటు అమూల్యమైన సమయం కూడా వృధా అవుతుంది.
undefined
click me!