ఏప్రిల్ తర్వాత స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు కాసింత కష్టమే?!

By Siva Kodati  |  First Published Jan 26, 2020, 2:38 PM IST

విదేశాల నుంచి వస్తువుల దిగుమతులపై సుంకాల మోత మోగనున్నది. 5-10 శాతం పెంచేందుకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. 50కి పైగా వస్తువులను లక్ష్యంగా కేంద్ర ఆర్థికశాఖ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


సెల్ ఫోన్ చార్జర్లు, వైబ్రేటర్ మోటర్లు, రింగర్లతోపాటు ఇతర విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న స్మార్ట్ ఫోన్ వినియోగ దారులపై సుంకాల పెంపు ప్రభావం పడనున్నది. అంతే కాక భారతీయ రిటైల్ రంగంలో విస్తరిస్తున్న ఫర్నీచర్ దిగ్గజం ‘ఐకియా’ కూడా ఇబ్బందులు ఎదుర్కోనున్నది. 

భారతదేశంలో దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నాయంటూ గతంలోనే ఐకియా ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే దిగుమతులపై సుంకాలను పెంచేయడంతో చైనా, ఏషియాన్ దేశాల నుంచి దిగుముతులు చేసుకుంటున్న దేశీయ తయారీ దారులు లబ్ధి పొందనున్నారు. 

Latest Videos

Also Read:6న అమెరికాలో మోటో 'రేజర్' ఫోన్ ఆవిష్కరణ.. భారత్‌లో రిలీజ్‌పై అనిశ్చితి

భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న దేశాల నుంచి కూడా  దిగుమతులు ఉన్నాయి. దీనిపై స్పందించడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ, వాణిజ్య మంత్రిత్వశాఖల అధికార ప్రతినిధులు స్పందించలేదు. 

స్మార్ట్ ఫోన్ల విడి భాగాలతోపాటు 50కి పైగా వస్తువులపై సుంకాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.ఈ వస్తువుల జాబితాలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, కెమికల్స్, హ్యాండీ క్రాఫ్ట్ ఉన్నాయి. 

అధిక కస్టమ్స్ డ్యూటీ విధింపుతో మొబైల్ ఫోన్ల చార్జర్లు, ఇండస్ట్రీయల్ కెమికల్స్, ల్యాంపులు (దీపాలు), చెక్క ఫర్నీచర్, కొవ్వొత్తులు, నగలు, హస్తకళల వస్తువుల ధరలు పెరుగనున్నాయని తెలుస్తోంది. వీటిపై దిగుమతి సుంకాలపై 5-10 వాతం పెంచాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది.

ట్రేడ్ ప్యానెల్, ఆర్థికశాఖ అధికారులు, ఇతర వర్గాల నుంచి అందిన సిఫారసుల మేరకు ప్రభుత్వం ఒక జాబితాను రూపొందించిందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. అనవసర దిగుమతులను తగ్గించడమే లక్ష్యం అని ఆ వర్గాల కథనం. 

చైనా నుంచి తక్కువ ధరకే విడి భాగాలను దిగుమతి చేసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ తయారుదారులు ఈ ప్రతిపాదనతో లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయని ఆర్థికశాఖ, పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. జీడీపీ పెరుగుదలకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ అంశాలను వచ్చేనెల ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించనున్నారని ఆర్థిక శాఖ అధికారులు తెలిపాయి.

స్థానిక పరిశ్రమల అధినేతలతో, ప్రతినిధులతో వాణిజ్య మంత్రిత్వశాఖ సంప్రదింపుల్లో పలు కీలకాంశాలు బయటకు వచ్చాయి. దాదాపు 130కి పైగా వస్తువులు దేశంలో 100 బిలియన్ డాలర్ల దిగుమతులకు కారణమని ఈ సంప్రదింపుల్లో తేలిందని ఓ అధికారి వివరించారు. 

Also Read:వాట్సాప్ కొత్త ఫీచర్...వెంటనే డౌన్ లోడ్ చేసుకోండీ

ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దిగుమతులపై పలు నిబంధనలు, ఆంక్షలు విధించారు. తర్వాతీ కాలంలో తయారీ, రక్షణ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడుల కోసం సదరు ఆంక్షలను సరళతరం చేశారు. 

దేశంలోని దిగుమతి అవసరం లేని వస్తువులపై కూడా ప్రభుత్వం సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఉచిత ఒప్పందాల విషయమై దేశంలోకి భారీగా సాగుతున్న దిగుమతుల అంశానికి పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు బీజేపీ ఎకనమిక్ అఫైర్స్ సెల్ చీఫ్ గోపాల్ క్రిష్టన్ అగర్వాల్ తెలిపారు. 

click me!