మునగకాయల్లో ఉండే పోషకాలు గాల్ బ్లాడర్ పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ తగ్గుతుంది. ఇది మధుమేహం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. తరచూ మునగకాయలను తీసుకుంటే మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.
మునగకాయను ఇష్టపడని వారి సంఖ్య చాలా అరుదుగానే ఉంటుందనే చెప్పాలి. దీని రుచి అందరికీ నచ్చుతుంది. అసలు సాంబారులో మునగకాయ లేకపోతే... దానికి రుచే రాదు అనుకోండి. ఈ మునగ కేవలం రుచి మాత్రమేకాదు.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తోంది.
మునగ ఎక్కువగా తింటే... పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుందని పెద్దలు చెబితే వినే ఉంటారు. కేవలం అదొక్కటే కాదు.. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మునగకాయల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో వారు శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు. వీర్యం వృద్ధి చెందుతుంది. శుక్ర కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
మునగకాయల్లో ఉండే పోషకాలు గాల్ బ్లాడర్ పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ తగ్గుతుంది. ఇది మధుమేహం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. తరచూ మునగకాయలను తీసుకుంటే మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.
బి విటమిన్లు అయిన నియాసిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ 12 వంటివి మునగకాయల్లో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఇవి జీర్ణ సమస్యలను పోగొడతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తాయి.
ఎముకల పెరుగుదల, దృఢత్వానికి అవసరం అయ్యే ఐరన్, కాల్షియంలు మునగకాయల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను పటిష్టంగా మారుస్తాయి. ప్రధానంగా మహిళలు, పిల్లలకు ఇవి ఎంతగానో అవసరం.
మునగ కాయలను తరచూ తీసుకోవడం వల్ల రక్త శుద్ది బాగా జరుగుతుంది. అదేవిధంగా రక్తం సరఫరా కూడా అవుతుంది. అంతేకాదు.. బీపీ సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి. అంతేకాదు.. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. స్త్రీలలో అయితే.. చర్మం మృదువుగా మారి కాంతిని ఇస్తుంది.