నందమూరి తారకరామారావు బయోపిక్ అంటే ముఖ్యమంత్రిగా కన్నా సినిమా నటుడుగా ఆయన అభిమానులు ఉన్నారు. సినిమా హీరోయిన్స్, షూటింగ్స్, అప్పటి విశేషాలు చూడవచ్చు అనే అంశాలు జనాల్లో క్యూరియాసిటీ రప్పించాయి. అయితే వైయస్ కు ఆ విధమైన సినీ గ్లామర్ లేదు ...ముఖ్యమంత్రిగా ఆయన్ను అభిమానించేవారు..
--సూర్య ప్రకాష్ జోశ్యల
నందమూరి తారకరామారావు బయోపిక్ అంటే ముఖ్యమంత్రిగా కన్నా సినిమా నటుడుగా ఆయన అభిమానులు ఉన్నారు. సినిమా హీరోయిన్స్, షూటింగ్స్, అప్పటి విశేషాలు చూడవచ్చు అనే అంశాలు జనాల్లో క్యూరియాసిటీ రప్పించాయి. అయితే వైయస్ కు ఆ విధమైన సినీ గ్లామర్ లేదు ...ముఖ్యమంత్రిగా ఆయన్ను అభిమానించేవారు..ఆయన పార్టీవారే ఈ సినిమా చూడాలనే ఆసక్తిగా ఉంటారు.
undefined
అదే సమయంలో ఈ సినిమాలో తమ పార్టీపై విమర్శలు ఏమన్నా చేసారేమో అని కాంగ్రేస్, తెలుగుదేశం వాళ్లు వెళ్లాలి. అంతకు మించి అవకాసం లేదు. అయితే వీరంతా సినిమా రిలీజ్ రోజే చూస్తారన్న నమ్మకం లేదు. రిలీజైన తర్వాత వచ్చే టాక్ ని బట్టి వెళ్తారు. అంటే సామాన్య ప్రేక్షకులు, పార్టీ వాళ్లే ఈ సినిమాకు మొదట్లో మహారాజ పోషకులు. వాళ్లను ఎంతవరకూ ఈ సినిమా అలరించింది.
ఈ సినిమా వైయస్ఆర్సీపీ ప్రచారానికి ఏమన్నా పనికొస్తుందా... పొలిటికల్ ఇంట్రస్ట్ లేని సామాన్యులను ఈ చిత్రం ఏ మేరకు అలరించే అవకాశం ఉంది, తెలుగుదేశం గురించి ఏమన్నా ప్రస్దావించారా.. వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి..
ఈ సినిమా వైయస్ పుట్టిన దగ్గర నుంచి కథ మొదలు కాదు. కేవలం టైటిల్ లో చెప్పినట్లు యాత్రం అనే ఈవెంట్ బేస్ ని చేసుకుని..2003లో జరిగిన కొన్ని సంఘటనల సమాహారం. రూలింగ్ పార్టీ మనదేశం ముందుస్తు ఎన్నికలు వెళ్తూండటంతో ...వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి(మమ్ముట్టి) వర్రీగా ఉంటారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా తన నియోజక వర్గంలో.. జిల్లా నేతలతో సంప్రదింపులు జరుపుతుంటాడు. ఆయనకి కె.వి.పి.రామచంద్రరావు(రావురమేష్) అన్ని విషయాల్లో సలహాదారుడుగా ఉంటారు. ఈ లోగా (కాంగ్రేస్ )పార్టీ హై కమాండ్ ఓ నియోజక వర్గంలో సుబ్బారెడ్డి అనే వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెట్టబోతుంది. కానీ వై.ఎస్ ఆ సీటును అప్పటికే సుచరితకు కేటాయించటంతో విభేదాలు వస్తాయి.
హై కమాండ్ నుంచి వచ్చిన తివారీ.. వై.ఎస్‌ను సున్నితంగా హెచ్చరిస్తాడు. కానీ తాను మాట ఇస్తే ముందుకెళతానని వెనక్కి తగ్గనని తన వ్యక్తత్వం నిలుపుకుంటాడు వై.ఎస్. ఓ వైపు ప్రచారం చేసుకోవడానికి టైమ్ లేదు. ఆర్ధికంగా కూడా అంతంత మాత్రమే. ఇది వైయస్ కు పెద్ద టాస్క్. ఆలోచనలో పడ్డ వైయస్ కు ఓ ఆలోచన వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల స్థితు గతులు బాగోవు. రైతాంగ సమస్యలు, ప్రజల కష్టాలను చూసి చలించి పోయి వైయస్ఆర్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని, రైతుల సమస్యలను లైవ్ లో తెలుసుకోవాలనుకుంటాడు.
అందుకోస తాను పాద యాత్రకు వెళ్తున్నానని హై కమాండ్‌కు ఓ మాట చెబుతాడు. కానీ వారు పర్మిషన్ ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులకు వైయస్ తప్ప ఎవరు సీఎం అయిన పర్వాలేదు అన్నట్లుగా వ్యతిరేకతతో ఉంటార.అయినా సరే పాదయాత్ర ప్రారంభిస్తాడు. మొదట పాదయాత్రకు ప్రజల నుండి పెద్దగా స్పందన ఉండదు. కానీ ఆయన కష్టం గుర్తించినట్లుగా ... స్పందన రోజు రోజుకీ క్రమంగా పెరుగుతూ వస్తుంది.
ఇక పాద యాత్ర హై సక్సెస్ అవటంతో వైయస్ఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అధికారంలోకి వచ్చాక ఆయన ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆరోగ్య శ్రీ, ఫీజ్ రిఎంబర్స్‌మెంట్, ఆయనకు చాలా పేరు తీసుకొచ్చాయి. ఆ క్రమంలో తిరిగి రెండోసారి సీఎం అవ్వడం..హెలికాప్టర్ ప్రమాదంలో స్వర్గస్తుడవటం తో ‘యాత్ర’ముగుస్తుంది.ఎపిసోడిక్ గా ఉన్న ఈ సిట్యువేషన్స్ అన్ని కథలో భాగంగా ఎలా కలపాలో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఆ యాత్ర సమయంలో వైఎస్‌ఆర్‌కు ఎదురైన అనుభవాలు. వాటి వల్ల వైఎస్ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులే ఈ సినిమా కథ. వైఎస్ జీవితంలో జరిగిన సంఘటనలు చూపిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు.. ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి.. పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది.. యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి అన్నదే కథ.
ఎలా ఉంది..
ఈ సినిమా వైయస్ పై తీసిన ఓ డాక్యుమెంటరీలా ఉంది. అయితే సినిమా లక్షణాలు చాలా ఉన్నాయి. ఎక్కడ హైలెట్ చెయ్యాలో ...ఏం ఆశించి ఈ సినిమా తీసారో ఆ యాంగిల్ మాత్రం మిస్ కాలేదు. దర్శకుడు చాలా అధింటిక్ స్టైల్ లో వైయస్ పాత్రను హైలెట్ చేసారు. పాద యాత్ర ని అడ్డం పెట్టి వైయస్ లో ఉన్న లీడర్ షిప్ క్వాలటీస్ ని, ఆయన మంచివాడని, హృదయం ఉన్న మనిషి అని చూపెట్టడంతో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమా అన్ని విభాగాల్లో చాలా బాగా తీసారు. వైయస్సార్ అభిమానులు, జగన్ ఫ్యాన్స్, వైయస్సార్పీ పార్టీ కార్యకర్తలకు అందరూ పండగ చేసుకునే సినిమా ఇది. అయితే జనరల్ ఆడియన్స్ కు ఎంతవరకూ ఈ సినిమా పట్టుతుందనేది సందేహాస్పదమే.
పార్టీకి ఉపయోగపడుతుందా..
ఈ సినిమా పైకి వైయస్ పాదయాత్రను మాత్రమే చూపెడుతున్నట్లు కనపడుతుంది కానీ అండర్ కరెంట్ గా ...అంతర్గత రాజకీయ లక్ష్యాలతో ముందుకు వెళ్తుంది. వైయస్ జగన్ కు , ఆయన పార్టీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సరైన టైమ్ లో వచ్చిన సరైన సినిమా అని చెప్పాలి.
సాంకేతికంగా..
ఈ సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంది. మొదటి సీన్ నుంచి చివరి వరకూ తెలిసిన కథే అయినా బోర్ కొట్టకుండా కుర్చిలో కూర్చోబెట్టగలిగాడు. స్టోరీ నేరేషన్ లో ఓ స్టైల్ ని ఫాలో అవటమే కలిసొచ్చింది. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ కూడా సినిమా కు కలిసొచ్చాయి. సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..చాలా సన్నివేశాలకు ప్రాణంగా నిలిచింది. సినిమాటోగ్రఫి కూడా బాగుంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ లాంటి టెక్నీషియన్ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.
హైలెట్స్..
ఈ సినిమాలో ఫస్ట్ హైలెట్ ముమ్మట్టి. వేరే ఆర్టిస్ట్ ఎవరైనా అంత బాగా చేసి ఉండకపోదురేమో అనిపించింది. వైయస్ గురించి ఆయన ఎంత తెలుసుకున్నాడో కానీ...వైయస్ ని మాత్రం అలా దించేసారు. పార్టీ హైకమాండ్ ని థిక్కరించి అన్ని తానే పార్టీని నడిపేటప్పుడు చూపే మొండితనం , పాద యాత్రలో రైతుల కష్టాలకు ఎమోషనల్ గా స్పందించటం వంటి సీన్స్ లో ముమ్మట్టి నటనకు హ్యాట్సాఫ్ అనేస్తాం. వైయస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, సబితా ఇంద్రరెడ్డి పాత్రలో సుహాసిని ఫెరఫెక్ట్ ఆప్షన్. సుచరిత పాత్రలో నటించిన అనసూయ ఉన్నవి కొద్ది సీన్స్ అయినా కథలో కీలకంగా నిలిచింది. విజయమ్మగా అశ్రిత వేముగంటి కనిపించి కొన్ని సీన్లైనా బాగా చేసారు. హస్పిటల్‌లో వైఎస్‌ఆర్ కళ్ల ముందే ఓ చిన్నారి ప్రాణాలొదలటం సీన్ కన్నీళ్లు పెట్టిస్తుంది.
డైలాగులతో నిలబెట్టేసారు..
ఇక సినిమాకు ప్లస్ అయిన అంశాల్లో డైలాగులు ఒకటి. ‘మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా' అనటం ,'మాట ఇచ్చేముందు ఆలోచించాలి.. ఇచ్చాక చేసేదేముంది ముందుకెళ్లాల్సిందే', 'నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే బానిసను కాదు నేను విన్నాను.. నేనున్నాను', ‘నాకు వినపడుతున్నాయ్', వంటివాటికి ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.
మైనస్ లు
సినిమా అని చెప్పి డాక్యుమెంటరీ చేయటం, స్లోగా నేరేట్ చేయటం. కేవీపి పాత్ర, సూరీడు పాత్ర నిడివి, ప్రాధాన్యత బాగా తగ్గించటం.
చేవెళ్ల చెల్లమ్మ..
చేవెళ్ల చెల్లమ్మ అని సబితా ఇంద్రారెడ్డిని ...వైయస్ ఎందుకు అనేవారో ఈ సినిమా లో మరోసారి గుర్తు చేస్తారు. చేవెళ్లలో యాత్రను ప్రారంభిస్తానంటే... తన లాంటి వారు ఎదురు రాకూడదని ... వేరేచోటు నుండి యాత్రను ప్రారంభించాలని సబితా ఇంద్రారెడ్డి వైఎస్ఆర్‌ను కోరితే వైయస్ కొట్టి పారేసి , యాత్రను దిగ్విజయం చేసినట్లుగా ఈ సినిమాలో చూపారు.
తెలుగుదేశం పై...
ఇక కరెంట్ ఛార్జీలు పెంచినందకు నిరసనగా ధర్నా చేపట్టిన రైతులపై అప్పటి ప్రభుత్వం కాల్పులు జరపించిండం, పాదయాత్ర జరుగుతున్న సమయంలో కరెంటు ఛార్జీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం.. అప్పుడే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలనే ఆలోచన వైయస్ఆర్‌కు రావడం వంటివి చూపించారు.
బ్రీఫ్‌డ్ మీ..
అలాగే అప్పటి ఎలక్షన్స్ లో వైయస్ ని గెలవనీయకుండా చేయటానికి టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేయించినట్టు ఓ సీన్ ఉంటుంది. కదిరి నుంచి టీడీపీ తరుపన ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకున్న అభ్యర్థి (పోసాని కృష్ణమురళి)ని కాంగ్రెస్ పార్టీలో టీడీపీ కోవర్టుగా ప్రవేశ పెడతారు. అలా రాజశేఖర్ రెడ్డిని దెబ్బ తీయాలనుకున్నట్టు సీన్స్ డిజైన్ చేసారు. '
ఈ సీన్స్‌లో భాగంగా పోసానిని అక్కడి టీడీపీ నేతలు బిగ్‌బాస్ (చంద్రబాబు)తో ఫోన్‌లో మాట్లామని అంటారు. దానికి చంద్రబాబు..బ్రదర్ ఎలా ఉన్నారు..మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ, వీర్ విత్ యూ డోంట్ వర్రీ అనే డైలాగులు కు ధియోటర్స్ దద్దరిల్లాయియి.
అయితే టెక్నికల్ గా ఇబ్బందులు రాకుండా చంద్రబాబు ప్రస్తావన సినిమా ఉన్నా ఎక్కడా చంద్రబాబు కనిపించకుండా చేసారు. కానీ ఆయనను పోలిన గొంతే మనకు వినిపిస్తుంది.
ఫైనల్ థాట్..
ఈ సినిమా వైయస్ అభిమానులకు, పార్టీకి అమృత పాత్ర..కానీ మిగతా వాళ్లకి చేదు మాత్ర.
రేటింగ్: 2.5/5
ఎవరెవరు..
నిర్మాణ సంస్థ: 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
తారాగణం: మమ్ముట్టి, రావు రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు
కెమెరా: సత్యన్ సూర్యన్
మ్యూజిక్: కె ( క్రిష్ణ కుమార్ )
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మోనిక సబ్బాని
సౌండ్ డిజైన్: సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్: Knack Studios
సమర్పణ: శివ మేక
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ : మహి వి రాఘవ్