ఈ దీపావళికి మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు బిగ్‌బాస్. దసరా టైమ్‌లో నాగ్ అందుబాటులో లేకపోవడంతో సమంతతో హోస్ట్ గా షో నిర్వహించారు. సమంత వ్యాఖ్యాతగా అలరించింది. ఈ షోలోనే అఖిల్ మెరవగా, కార్తికేయ, పాయల్ డాన్సులతో మెస్మరైజ్ చేశాడు.
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదో వారం మధ్యలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ టాస్క్ లో సభ్యుల మధ్య నెలకొన్న గందరగోళంతో టాస్క్ నే రద్దు చేశాడు బిగ్‌బాస్. అంతేకాదు ఉన్నట్టుండి అర్థరాత్రి సభ్యులను అన్నీ సర్దుకుని బయటకు రావాలని చెప్పాడు షాక్ ఇచ్చాడు. అంతేకాదు అందరిలో ఒకరిని ఎంపిక చేసి ఇంటి నుంచి బయటకు పంపించేయాలని చెప్పగా అందరు కలిసి అఖిల్ పేరు చెప్పాడు. దీంతో అఖిల్‌ని ఓ సీక్రెట్ రూమ్‌లో పెట్టాడు బిగ్‌బాస్. ఇంట్లో జరిగే విషయాలను, ఎవరు ఏం
మాట్లాడుతున్నారనే విషయాన్ని మరో కన్ను రూపంలో అఖిల్ గమనిస్తున్నాడు. అన్నీ వింటున్నాడు.
ఇదిలా ఉంటే ఈ దీపావళికి మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు బిగ్‌బాస్. దసరా టైమ్‌లో నాగ్ అందుబాటులో లేకపోవడంతో సమంతతో హోస్ట్ గా షో నిర్వహించారు. సమంత వ్యాఖ్యాతగా అలరించింది. ఈ షోలోనే అఖిల్ మెరవగా, కార్తికేయ, పాయల్ డాన్సులతో మెస్మరైజ్ చేశాడు. హైపర్ ఆది పంచ్‌లతో కాసేపు అలరించారు. ఇక గత ఆదివారం సుమని వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరుతో తీసుకొచ్చి కాసేపు పంచ్‌ల మీద పంచ్‌లు వేయించి అలరించాడు.
ఇక ఈ ఆదివారం, దీపావళి సందర్భంగా మరో స్పెషల్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారని టాక్. అయితే ఈ ఎపిసోడ్‌లో నాగచైతన్య సందడి చేయబోతున్నారని అంటున్నారు. అయితే ఆయన హోస్ట్ గా వస్తాడా? లేక గెస్ట్ గా వస్తాడా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ఇటీవల చిరంజీవి కరోనా బారిన పడటంతో, ఆయన్ని కలిసిన నాగార్జున విషయంలోనూ అనుమానాలు నెలకొన్నాయి. అయితే నాగ్ టెస్ట్ చేయించుకోగా, నెగటివ్ అని తేలింది. మరి నాగార్జునే హోస్ట్ గా వస్తాడా? చైతూతో నిర్వహిస్తారా? లేక చైతూ గెస్ట్ గా మెరస్తాడా? అన్నది చూడాలి. అయితే దీపావళి ఎపిసోడ్‌ని ఇంకాస్త వెరైటీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.