
యదార్థ సన్నివేశాల ఆధారంగా రూపొందిన `విరాటపర్వం`(Virataparvam) చిత్రం శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందనతో రన్ అవుతుంది. రానా, సాయిపల్లవి వంటి భారీ స్టార్ కాస్ట్ ఉన్న ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. సాయిపల్లవి నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె సినిమాని తన భుజాలపై వేసుకుని నడిపించిందని అంటున్నారు ఆడియెన్స్. ఆమె ప్రేమ కోసం ఎంతటి పోరాటం చేసిందనేదానిపై అభినందనలు వస్తున్నాయి.
చరిత్రలో మరుగున పడిన గొప్ప కథని దర్శకుడు వేణు ఊడుగుల `విరాటపర్వం` చిత్రంతో చెప్పే ప్రయత్నం చేశారు. నక్సల్స్ నేపథ్యంలోని ప్రేమని చెప్పడమనే పాయింట్‌తోనే ఆయన పెద్ద సాహసం చేశాడు. సినిమా తీసేందుకు ఓ యుద్ధమే చేశాడని `విరాటపర్వం` చూస్తుంటే అర్థమవుతుంది. నక్సల్స్ లోనూ ప్రేమ కథ ఉందని, అదొక గొప్ప ప్రేమ అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా నేటి తరానికి చెప్పాడు దర్శకుడు. అయితే సినిమా టేకింగ్ విషయంలో కొన్ని విమర్శలు వస్తున్నాయి. కాస్త బోరింగ్‌గా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిటిజల్ స్ట్రీమింగ్ ఎప్పుడనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. `విరాటపర్వం` ఓటీటీలో (Virataparvam OTT)త్వరలోనే రాబోతుందట. ఈ చిత్ర డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా ముందు నెట్‌ఫ్లిక్స్ లోనే విడుదలవుతుందంటూ ప్రచారం జరిగింది. కానీ థియేటర్ కి ఆదరణ పెరగడంతో, భారీ సినిమాలు మంచి కలెక్షన్లు సాధించడంతో ఈ సినిమా కూడా మంచి విజయం సాధించే అవకాశాలున్నాయని, నెట్ ఫ్లిక్స్ డీల్‌ని వాయిదా వేసుకుని థియేటర్లో రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈ చిత్రం మరో నాలుగు వారల్లో ఓటీటీలో రాబోతుందట. సినిమా విడుదలైయ్యాక నాలుగు వారాల తర్వాతే రాబోతుందని తెలుస్తుంది. ఈ లెక్కన జులై మూడో వారంలో `విరాటపర్వం` సినిమా ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. అయితే ఓటీటీ రైట్స్ రూపంలో ఈ చిత్రానికి భారీగానే దక్కిందని ఫిల్మ్ నగర్ టాక్. సురేష్‌బాబు, ఇతర నిర్మాతలు సుధాకర్ చెరుకూరి ముందుగానే పక్క ప్లాన్ తో ఓటీటీకి అమ్మేసినట్టు సమాచారం. అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.