
రానా అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా విరాటపర్వం. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల డైరెక్ట్ చేశాడు. దాదాపు రెండేళ్ళుగా రిలీజ్ కు ఎదురు చూస్తున్నఈ మూవీ...కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా ఈమూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు టీమ్. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
ఇక రిలీజ్ డేట్ రావడంతో.. వరుసగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు టీమ్. ఆ మధ్య కర్నూలు లో.. ప్లాన్ చేసిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. గాలి దుమారం వల్ల ప్లాప్ అయ్యింది. ఇక సినిమాకు సంబంధించిన వరుస అప్‌డేట్స్ ను రిలీజ్ చేస్తున్నారు టీమ్. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్‌డేట్‌ను ప్రకటించారు.
ఈ సినిమాలో ని ‘ఛలో ఛలో’ అంటూ సాగే వారియర్ సాంగ్‌ను ఆదివారం విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో విశేషం ఏంటంటే ఈ పాటను స్వయంగా రానా ఆలపించాడు. ఇక రీసెంట్ గామూవీ టీమ్ సినీ ప్రముఖులకు ప్రీమియర్ షోలు వేయగా.. వాళ్ళ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.ప్రియమణి కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు.