రౌడీ హీరో విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫిల్మ్ Kushi. ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెట్స్ లో కేక్ కట్ చేసి యూనిట్ సందడి చేసింది.
నెలన్నరలో ‘ఖుషి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - సమంత జంటగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై శంకర్ రవిశంకర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ కు సినిమాపై మంచి హైప్ పెరిగింది. ప్రమోషనల్ మెటీరియల్ కూడా గ్రాండ్ గా ఉంది. సినిమాపై రోజురోజుకు అంచనాలను పెంచేస్తోంది.
గతేడాది మధ్యనుంచి మూవీ షూటింగ్ కొనసాగుతోంది. ఎక్కడా గ్యాప్ లేకుండా డైరెక్టర్ శివ నిర్వాణ శరవేగంగా షూటింగ్ పూర్తి చేశారు. ఈరోజుతో సినిమా చిత్రీకరణ పూర్తైంది. ఈ సందర్బంగా సెట్స్ లో గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ ముగిసిందంటూ శివ నిర్వాణ అధికారికింగా ప్రకటించారు. విజయ్ దేవరకొండ చిత్ర యూనిట్ తో కలిసి కేక్ కట్ చేశారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయని తెలిపారు.
‘మహానటి’ తర్వాత విజయ్ - సమంత మరోసారి వెండితెరపై ‘ఖుషి’ ద్వారా అలరించబోతున్నారు. దీంతో ఆడియెన్స్ లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, సాంగ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలవనుంది. మొత్తానికి షూటింగ్ పూర్తి కావడంతో యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందించేందుకు రెడీ అవుతోంది.
సెప్టెంబర్ 1న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఏకకాలంలో విడుదల కానుంది. చిత్రంలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
It is a wrap for ❤️🔥
Post-production in full swing 💥💥
In cinemas on 1st September 2023 in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam ❤️ pic.twitter.com/7l1qHMuwh7