డిఫరెంట్ గెటప్స్ లో వరల్డ్ ఫెమస్ లవర్

Published : Sep 19, 2019, 10:01 AM ISTUpdated : Sep 19, 2019, 10:21 AM IST
డిఫరెంట్ గెటప్స్ లో వరల్డ్ ఫెమస్ లవర్

సారాంశం

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో ఇటీవల ఫెయిల్యూర్ అందుకున్నాడు. భారీ స్థాయిలో నాలుగు భాషల్లో రిలీజైన ఆ సినిమా విజయ్ కి ఎలాంటి లాభాన్ని ఇవ్వలేకపోయింది. ఇక నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఈ కుర్ర హీరో డిఫరెంట్ సినిమాతో కష్టపడుతున్నాడు. 

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సినిమాకు 'వరల్డ్ ఫెమస్ లవర్.' అనే టైటిల్ ని కూడా సెట్ చేశారు. అయితే సినిమాలో విజయ్ నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడట. అందుకే నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాశి ఖన్నాతో పాటు ఐశ్వర్య రాజేష్ - క్యాథెరిన్ - ఇజబెల్లె వంటి బ్యూటిఫుల్ హీరోయిన్స్ విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 

మొదట ఈ సినిమాకు బ్రేకప్ అనే టైటిల్ ని అనుకున్నారు. మొన్నటివరకు అదే పేరు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కానీ ఫైనల్ గా వరల్డ్ ఫెమస్ లవర్ అనే టైటిల్ ని సెట్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ నాలుగు క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నాడు అంటే సినిమాలో ఊహించని ట్విస్ట్ ఎదో ఉండబోతుందని ఊహించవచ్చు. మరి ఆ కాన్సెప్ట్ ను క్రాంతి మాధవ్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?