తలపతి విజయ్ మరో క్రేజీ అప్డేట్ తో వచ్చేశారు. ఆయన 66వ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల డేట్ ఫిక్స్ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
కోలీవుడ్ స్టార్ విజయ్ (Thalapathy Vijay)చకచకా చిత్రాలు చేస్తున్నారు. మిగతా స్టార్స్ తో పోల్చుకుంటే ఆయన ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదల చేస్తున్నారు. కరోనా కారణంగా 2020 లో మాత్రం గ్యాప్ వచ్చింది. 2019 లో బిగిల్ తో భారీ హిట్ కొట్టిన విజయ్, మాస్టర్ మూవీతో విజయాల పరంపర కంటిన్యూ చేశారు. లేటెస్ట్ రిలీజ్ బీస్ట్ మాత్రం నిరాశపరిచింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. అయితే నెగిటివ్ టాక్ లో కూడా బీస్ట్ తమిళనాడులో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది.
ఇక బీస్ట్ (beast) చిత్రీకరణ సమయంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లితో విజయ్ మూవీ ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ మొదలు కాగా... ఫస్ట్ లుక్ సిద్ధం చేస్తున్నారు. జూన్ 22న విజయ్ బర్త్ డే. దీన్ని పురస్కరించుకొని తలపతి 66 ఫస్ట్ లుక్ (Thalapathy 66 First Look) జూన్ 21న సాయంత్రం 6:01 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సడన్ సర్పైజ్ అప్డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. విజయ్ 66వ చిత్ర ఫస్ట్ లుక్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
HE IS RETURNING...
Thalapathy sir pic.twitter.com/vXddUbOSzA
— Sri Venkateswara Creations (@SVC_official)
తలపతి 66 మూవీ హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తున్నారు. విజయ్ తో ఆమెకు ఇదే మొదటి చిత్రం. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మహర్షి మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి విజయ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా విజయ్ నెక్స్ట్ విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ తో మూవీ చేస్తున్నారు.