యాక్షన్‌ సినిమాలు చేద్దామంటే లవ్‌ స్టోరీలొస్తున్నాయంటోన్న వరుణ్‌ తేజ్‌.. నితిన్‌, సాయితేజ్‌తో మల్టీస్టారర్..

Published : Apr 06, 2022, 04:04 PM ISTUpdated : Apr 06, 2022, 04:06 PM IST
యాక్షన్‌ సినిమాలు చేద్దామంటే లవ్‌ స్టోరీలొస్తున్నాయంటోన్న వరుణ్‌ తేజ్‌.. నితిన్‌, సాయితేజ్‌తో మల్టీస్టారర్..

సారాంశం

మల్టీస్టారర్లపై వరుణ్‌ తేజ్‌ స్పందిస్తూ తనకు నితిన్‌, సాయిధరమ్‌ తేజ్‌తో మంచి క్లోజ్డ్ రిలేషన్‌ ఉందని, మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తే వీరితో చేస్తానని తెలిపారు. చిరంజీవితో చేస్తారా? అనే ప్రశ్నకి స్పందిస్తూ, డాడీ ఒక్క కాల్‌ చేస్తే చాలు. మంచి కథ వస్తే చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అన్నారు.

తాను యాక్షన్‌ సినిమాలు చేద్దామనే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పారు వరుణ్‌ తేజ్‌(Varun Tej). అయితే తన వద్దకు లవ్‌స్టోరీలే ఎక్కువగా వచ్చాయని, అవే సక్సెస్‌ అయ్యాయని చెప్పారు. అందుకే యాక్షన్‌ సినిమా చేయాలని `గని`(Ghani Movie) చేశానని తెలిపారు. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటిని డైరెక్టర్‌గా టాలీవుడ్‌కి పరిచయం చేస్తూ వరుణ్‌ తేజ్‌ నటించిన చిత్రం `గని`. సయీ మంజ్రేకర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్‌ శెట్టి కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఈ సినిమా ఏప్రిల్‌ 8న(శుక్రవారం) విడుదల కాబోతుంది. 

సినిమా ప్రమోషన్‌లో భాగంగా బుధవారం మీడియాతో ముచ్చటించారు వరుణ్‌ తేజ్‌. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాక్సింగ్‌ వంటి స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలంటే తనకు ఇష్టమని చెప్పారు. తెలుగులో కళ్యాణ్‌ బాబాయ్‌ చేసిన `తమ్ముడు`, శ్రీహరి నటించిన `భద్రాచలం` సినిమాలంటే ఇష్టం. బాలీవుడో స్పోర్ట్స్ చిత్రాలొస్తున్నాయి. హాలీవుడ్‌లో అన్ని రకాల స్పోర్ట్స్ చిత్రాలొస్తాయి. కానీ మన వద్ద రావడం లేదు. కిరణ్‌ కొర్రపాటి తన వద్దకు వచ్చి ఓ పాయింట్‌ చెప్పాడు.  అది కాదు ఇలా స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేద్దామని సలహా ఇచ్చా. ఆ తర్వాత బాక్సింగ్‌ నేపథ్యంలో అనుకుని రాసుకున్నామ`ని తెలిపారు వరుణ్‌ తేజ్‌. 

ఈ కథపై ప్రారంభం నుంచి తాను కూడా ఇన్‌వాల్వ్ అయినట్టు చెప్పారు. అనేక సలహాలిచ్చారట. దర్శకుడితో కలిసి ఈ కథని తీర్చిదిద్దామని తెలిపారు వరుణ్‌. అయితే బాక్సింగ్‌ అనుకున్నప్పుడు ఇంత కష్టం ఉంటుందనుకోలేదు. ఏముందిలే చేయోచ్చులే అనుకున్నా. కానీ సినిమా చేస్తున్నప్పుడు తెలిసింది ఎంత కష్టమో అని. కెరీర్‌లో అత్యంత కష్టపడిన సినిమా ఇదే. బాడీ మెయింటేన్‌ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు వరుణ్‌.  స్పోర్ట్స్ ఇష్టం కావడంతో కష్టమైనా ఇష్టంగా చేశానని తెలిపారు. ఈ సినిమాతో తనలో మంచి డిసిప్లెయిన్‌ వచ్చిందని చెప్పారు వరుణ్‌.

`గని`లోని తన పాత్ర, కథ గురించి చెబుతూ, సినిమాలో తన పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయట. మొదట ఎలాంటి గైడెన్స్ లేకుండా బాక్సింగ్‌ కోసం ప్రయత్నించే పాత్ర అని, ఆ తర్వాత మంచి గైడెన్స్ దొరకాక తన పాత్ర మరోలా ఉంటుందని వెల్లడించారు. గతంలో వచ్చిన బాక్సింగ్‌ చిత్రాలకు ఇది కాస్త భిన్నంగా ఉంటుందని, బాక్సర్‌ ఎమోషన్స్, స్ట్రగుల్స్ వేరుగా ఉంటాయని తెలిపారు. మదర్‌ సెంటిమెంట్‌ కూడా ఉంటుందన్నారు. బాక్సింగ్‌ కోసం యూఎస్‌కి చెందిన ట్రైనర్‌ టోనీ వద్ద కొంత ట్రైన్‌ అయ్యానని, ఆ తర్వాత ఇండియాకి చెందిన ట్రైనర్ల వద్ద ట్రైనింగ్‌ తీసుకున్నట్టు చెప్పారు వరుణ్‌ తేజ్‌. 

థమన్‌ సంగీతం సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందన్నారు. ఇందులో ఉపేంద్ర పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. బాగా స్టేచర్‌ ఉన్న పాత్ర కోసం ఆయన్ని తీసుకున్నామని, ఆయనలోని కొత్త యాంగిల్‌ని ఈ చిత్రంలో చూడొచ్చన్నారు. సునీల్‌ శెట్టి పాత్ర సైతం కొత్తగా ఉంటుందని, పాన్‌ ఇండియా ఇమేజ్‌ కోసం తీసుకోవాలేదన్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఇప్పటికే సినిమాలొచ్చాయి. అందుకే దీన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయడం లేదని తెలిపారు. తాను ఏ సినిమా అయినా పాన్‌ ఇండియా అని ప్లాన్‌ చేసుకుని చేయనని తెలిపారు. కథ బాగుందా, కొత్తగా ఉందా అనేది చూస్తానని తెలిపారు. 

మల్టీస్టారర్లపై వరుణ్‌ తేజ్‌ స్పందిస్తూ తనకు నితిన్‌, సాయిధరమ్‌ తేజ్‌తో మంచి క్లోజ్డ్ రిలేషన్‌ ఉందని, మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తే వీరితో చేస్తానని తెలిపారు. చిరంజీవితో చేస్తారా? అనే ప్రశ్నకి స్పందిస్తూ, డాడీ ఒక్క కాల్‌ చేస్తే చాలు. మంచి కథ వస్తే చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అన్నారు. మన తెలుగులో కమర్షియాలిటీ, నావెల్టీ బ్యాలెన్స్ గా ఉండే సినిమాలు ఆడతాయి. నాకు బేసిక్‌గా యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. యాక్షన్‌ సినిమాలు చేయడానికే ఇండస్ట్రీలోకి వచ్చాను.  కానీ లవ్‌ స్టోరీ చిత్రాలు బాగా ఆడాయి. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారుతో చేస్తున్న సినిమా కూడా యాక్షన్‌ సినిమానే అని చెప్పారు వరుణ్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?