
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష మృతిపై స్పందించారు.. మెగా కోడలు ఉపాసన, ప్రత్యూషను తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య సంఘటన పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారు. ఒక రకంగా ఆమె ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగభరిత ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ప్రత్యూషను ఉపాసన తన డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ రాసుకొచ్చారు. . ప్రత్యూష చాలా త్వరగానే వెళ్లిపోయిందని బాధపడ్డారు ఉపాసన.
అంతే కాదు ప్రత్యూష మరణంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఈ విషయాన్ని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నా అంటోంది ఉపాసన. ఆ పోస్ట్‌లో ఉపాసన తన ఆవేదనను అక్షర రూపంలో వ్యక్తం చేశారు.
ప్రత్యూష గరిమెళ్ల ప్రతి విషయంలోనూ ఉన్నతంగానే ఉండేవారని..కెరీర్ పరంగా, కుటుంబం, స్నేహితుల పరంగానూ ఉన్నత నిర్ణయాలే తీసుకునేదని ఉపాసన పేర్కొన్నారు. అన్ని విషయాల్లో ఉన్నతంగా ఉన్న ప్రత్యూష డిప్రెషన్‌కు గురి కావడం బాధ కలిగిస్తోందని తెలిపారు. ప్రత్యూష ఆత్మకు శాంతి కలగాలని ఉపాసన ఆకాంక్షించారు. తనతో కలిసి ప్రత్యూష దిగిన ఫొటోను ఉపాసన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.