
మహేష్ తో త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ వింటానికి చాలా బాగుంది కదూ. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత ఎందుకనో వీరిద్దరి కాంబోలో సినిమాలు రాలేదు. ఖలేజా చిత్రం ఊహించని స్దాయిలో భారీ డిజాస్టర్ కావటమే ఇందుకు కారణం అని అంతా భావిస్తున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ లు అభిప్రాయ బేధాలు గా మారి గ్యాప్ వచ్చిందిట. వీరిద్దరూ ఆ తర్వాత పెద్దగా ఒక చోట కలిసింది లేదు. అయితే జనాలు అనుకున్నంత విషయం లేదు. రీసెంట్ గా వీరిద్దరూ కలిసి ఓ యాడ్ కు పని చేయటం జరిగింది.
అయితే మళ్లీ సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో చిత్రాలు రెండు ఒకేసారి రిలీజ్ అవటం..పోటీ పడటంతో మళ్ళీ వీళ్ళ మధ్యన గ్యాప్ ఏర్పడిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కరోనా టైమ్ లో ఇద్దరూ ఫోన్ లలో ఒకరితో ఒకరు తీరిగ్గా కూర్చుని మాట్లాడుకున్నారట. ఒకరి క్షేమ సమాచారాలు మరొకరు తెలుసుకున్నారు. దాంతో మళ్లీ వీరి మధ్యన బాండింగ్ పెరుగుతోందని అంటున్నారు. దాంతో మళ్లీ ఈ కాంబోకు తెర తీసే అవకాసం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
త్రివిక్రమ్ కు క్లోజ్ ప్రెండ్ అయిన నిర్మాత రాధాకృష్ణ సైతం వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సాయిం చేస్తున్నారట. అన్ని అనుకున్నట్లుగా పాజిటివ్ గా జరిగిదే...వీరి కాంబినేషన్ లో ఖచ్చితంగా టాలీవుడ్ ఆనందపడే ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే...ఇద్దరూ కలిసి సినిమా చేద్దామనుకున్నా..వీరిద్దరు కమిట్మెంట్స్ తో చాలా టైమ్ పట్టేటట్లు ఉంది.మహేష్ ఓ ప్రక్కన పరుశరామ్ తో సినిమా ఓకే చేసుకున్నారు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమాకు రంగం సిద్దమవుతోంది.