టాలీవుడ్ లో మరో విషాదం, అనారోగ్యంతో హీరో సత్య కన్నుమూత

Published : Jun 03, 2022, 08:17 PM IST
టాలీవుడ్ లో మరో విషాదం, అనారోగ్యంతో  హీరో సత్య కన్నుమూత

సారాంశం

వరుస విషాదాలు ఫిల్మ్ ఇండస్ట్రీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎంతో మంది ఫిల్మ్ సెలబ్రిటీలు తిరిగి రాని లోకాలకు వెళ్లి పోతున్నారు. ఇక రీసెంట్ గా మరో యంగ్ స్టార్ మరణం టాలీవుడ్ లో విషాదం నింపింది.   

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు , హీరో స‌త్య  చిన్న వయస్సులోనే మృతి చెందాడు. ఈ యంగ్ స్టార్ కు  గురువారం సాయంత్రం ఆక‌స్మికంగా గుండెపోటు రావ‌డంతో.. వెంటనే స్పందించిన ఫ్యామిలీ మెంబర్స్ ద‌గ్గ‌ర్లో ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతుండ‌గానే సత్య తుది శ్వాస విడిచాడు. 

సత్య మృతి పట్ల ప‌లువురు సినీ  ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. సత్య మృతితో టాలీవుడ్ దిగ్బ్రాంతికి గురయ్యింది. క్యారెక్ట‌ర్ ఆర్టీస్టుగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన స‌త్య వ‌రం  సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. సత్య పూర్తి పేరు వి.రామసత్యనారాయణ. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో హీరో స్నేహితుడి పాత్రలు పోషించారు. తర్వాత వరం మూవీతో కథానాయకుడిగా మారారు. ఈ సినిమా పెద్దగా విజయవంతం ​కాలేదు. 

ఆ తర్వాత బ్యాచిలర్స్‌ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇది కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అవ‌డంతో ఈయ‌న‌కు టాలీవుడ్‌లో త‌గిన గుర్తింపు రాలేదు. దాంతో సినిమాల‌కు స్వ‌స్తి చెప్పి, బిజినెస్‌ల‌పై దృష్టి పెట్టాడు. అంతా బాగానే జ‌రుగుతున్న స‌మ‌యంలో గ‌తేడాది స‌త్య భార్య‌, తల్లి ఇద్ద‌రు చ‌నిపోయారు. దాంతో స‌త్య మాన‌సిక క్షోభ‌కు గురైయ్యాడు. అనారోగ్యంపాలు అయ్యాడు. అయతే సత్యకు  ఎనిమిదేళ్ళ కుమార్తె ఉంది. ఈ వయస్సులో పాపకు తల్లి తండ్రులు దూరం అయ్యారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?