టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరో వేణు. అటు కామెడీని, ఇటు సెంటిమెంట్ ని సమపాళ్లలో పండించగల అరుదైన నటుల్లో వేణు తొట్టెంపూడి ఒకరు.
టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరో వేణు. అటు కామెడీని, ఇటు సెంటిమెంట్ ని సమపాళ్లలో పండించగల అరుదైన నటుల్లో వేణు తొట్టెంపూడి ఒకరు. స్వయం వరం, చెప్పవే చిరువాలి, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలు వేణుకి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
హీరో వేణు స్టార్ డైరెక్టర్ బి గోపాల్ కి బంధువే. ఈ విషయాన్ని బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బి గోపాల్ మేనమామ కొడుకే వేణు. కెరీర్ పరంగా బి గోపాల్ వేణుకి సపోర్ట్ ఇచ్చారు కానీ.. అతడితో సినిమా చేయలేదు. దీనిపై బి గోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ బిగినింగ్ లో వేణుని ఇండస్ట్రీలో చాలా మందికి పరిచయం చేశాను.
కానీ వేణుతో సినిమా చేయలేదు. వేణు రెండు మూడు చిత్రాల్లో నటించిన తర్వాత నాదగ్గరికి వచ్చాడు. మామ ఇప్పుడు నువ్వు నాతో సినిమా చేస్తే చాలా బావుంటుంది అని అడిగాడు. అప్పటికే వేణుకి మంచి పేరు వచ్చింది. సేఫ్ గా సినిమా చేస్తున్నాడు. నేను వేణుని డైరెక్ట్ చేస్తే బడ్జెట్ లెక్కలు మారిపోతాయి. అందు వల్ల భయం వేసింది.
నిర్మాతలు ఎక్కువ బడ్జెట్ కావాలి అంటారు. ఏదైనా తేడా జరిగితే వేణు కెరీర్ పై ప్రభావం పడుతుంది. నీ స్టైల్ లో సినిమాలు చేస్తూ వెళ్ళు. రిస్క్ ఎందుకు.. ఏమైనా తేడా జరిగితే జీవితాంతం మీ నాన్న ముఖం చూడలేను అని చెప్పారట. తమిళంలో కూడా భారతీ రాజా లాంటి గొప్ప దర్శకులకు వేణుని పరిచయం చేశా. ఒక చిత్రంలో వేణుకి ఆయన విలన్ గా ఛాన్స్ ఇచ్చారు అని బి గోపాల్ తెలిపారు. ప్రస్తుతం వేణు హీరోగా సినిమాలు చేయడం మానేశారు. ప్రభావం బాగా తగ్గింది. ఇటీవల వేణు అతిథి అనే వెబ్ సిరీస్ లో నటించారు.