Vijay: పాపం విజయ్...రజనీ హిట్ పోస్టర్ కాపీ అంటూ రచ్చ

Surya Prakash   | Asianet News
Published : Jun 22, 2022, 08:10 AM IST
Vijay: పాపం విజయ్...రజనీ హిట్ పోస్టర్ కాపీ అంటూ రచ్చ

సారాంశం

 ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. జూన్‌ 22న విజయ్‌ బర్త్‌డే కావడంతో ఒక రోజుముందే దళపతి 66 సినిమా టైటిల్‌ను ప్రకటించారు.

సోషల్ మీడియా వచ్చాక ప్రతీ విషయం హాట్ టాపిక్ అయ్యిపోతోంది. ముఖ్యంగా సినిమాల విషయంలో చాలా ఎలర్ట్ గా ఉంటున్నారు ఫ్యాన్స్, యాంటి ఫాన్స్. పెద్ద హీరో చిత్రానికి సంభందించి పోస్టర్, ట్రైలర్, టీజర్ ఏది రిలీజైనా అందులో తప్పు,ఒప్పులు వెతికేస్తున్నారు. అలాగే వేరే సినిమాలతో పోలికలు ఉన్నాయా...ఏదన్నా కాపీనా వంటివి కనిపెట్టే పనిలో ఉంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు విజయ్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ గతంలో వచ్చిన రజనీ చిత్రం పోస్టర్ ని పోలి ఉందనే ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారం తమిళ సోషల్ మీడియాలో కనపడుతోంది. తెలుగులో పెద్దగా లేదు. ఇక్కడ విజయ్ కు ఫ్యాన్స్ కన్నా యాంటి ఫ్యాన్స్ ఎక్కువ ఉండటంతో ఇది జరుగుతోంది. వివరాల్లోకి వెళితే...

దళపతి విజయ్‌ ప్రస్తుతం తన 66వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. జూన్‌ 22న విజయ్‌ బర్త్‌డే కావడంతో ఒక రోజుముందే దళపతి 66 సినిమా టైటిల్‌ను ప్రకటించారు. విజయ్‌- వంశీల కలయికలో వస్తున్న చిత్రానికి వరిసు అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. 'వరిసుగా తిరిగొస్తున్న బాస్‌' అంటూ విజయ్‌ ఫస్ట్‌ లుక్‌ సైతం వదిలారు.

ఇందులో హీరో బిజినెస్‌మెన్‌గా కనిపిస్తున్నాడు. బర్త్‌డే ట్రీట్‌ ఒకరోజు ముందే ఇవ్వడంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో HBDDearThalapathyVijay,  Thalapathy66FirstLook హ్యాష్‌ట్యాగ్స్‌ తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రాబోతోంది. ఇదే సమంయలో ఈ చిత్రం పోస్టర్ గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన కబాలి చిత్రం ఫస్ట్ లా ఉందని గుర్తు చేస్తున్నారు. రెండు ప్రక్క ప్రక్కనే పెట్టి ..చూసుకోమంటున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ గతంలో నాగార్జున, ఇవివి సత్యనారాయణ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నుంచి తీసుకున్నారనే సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు పోస్టర్స్ కు పోలక ఉందో లేదో మీరూ చూసి కనిపెట్టండి.

 ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?