తమన్నా 'నవంబర్ స్టోరీ' రివ్యూ

By Surya Prakash  |  First Published May 21, 2021, 3:35 PM IST


తమన్నా సినిమాలతో పాటు ఓటీటిలపైనా దృష్టి పెట్టింది. ఓ ప్రక్కన ఓటీటి లో షోలుచేస్తూ మరో ప్రక్క వెబ్ సీరిస్ లలోనూ నటిస్తోంది. రీసెంట్ గా ఆమె లెవెంత్ అవర్ వెబ్ సీరిస్ చేసింది. ఇప్పుడు తాజాగా తమన్నా లీడ్ రోల్ లో నవంబర్ స్టోరి అనే వెబ్ సీరిస్ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్నది. మొత్తం 7 ఏపిసోడ్స్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందింది.ఇదో క్రైమ్ థ్రిల్లర్ కావటం, ట్రైలర్ బాగా జనాల్లోకి వెళ్లటంతో మంచి హైప్ వచ్చింది. ఆ హైప్ కు తగ్గట్లుగా ఈ సీరిస్ ఉందా లేక ఇది కూడా లెవెంత్ అవర్ దారిలోనే వెనక్కి వెళ్లిందా,కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  



తమన్నా సినిమాలతో పాటు ఓటీటిలపైనా దృష్టి పెట్టింది. ఓ ప్రక్కన ఓటీటి లో షోలుచేస్తూ మరో ప్రక్క వెబ్ సీరిస్ లలోనూ నటిస్తోంది. రీసెంట్ గా ఆమె లెవెంత్ అవర్ వెబ్ సీరిస్ చేసింది. ఇప్పుడు తాజాగా తమన్నా లీడ్ రోల్ లో నవంబర్ స్టోరి అనే వెబ్ సీరిస్ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్నది. మొత్తం 7 ఏపిసోడ్స్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందింది.ఇదో క్రైమ్ థ్రిల్లర్ కావటం, ట్రైలర్ బాగా జనాల్లోకి వెళ్లటంతో మంచి హైప్ వచ్చింది. ఆ హైప్ కు తగ్గట్లుగా ఈ సీరిస్ ఉందా లేక ఇది కూడా లెవెంత్ అవర్ దారిలోనే వెనక్కి వెళ్లిందా,కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

 కథేంటి

అనురాధ ఉరఫ్ అను(తమన్నా) చాలా తెలివైన అమ్మాయి..ఎథికల్ హ్యాకర్. ఆమె తండ్రి ఒకప్పటి క్రైమ్ నవలా రచయత గణేష్(జిఎం కుమార్). ప్రస్తుత ఆయన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూంటాడు. ఆమె తండ్రి అంటే ప్రాణం.  తన వృత్తిలో భాగంగా పోలీస్ డిపార్ట్ మెంట్ కి పాత ఫైల్స్ ని డిజిటల్ చేసేందుకు పనికొచ్చే సాఫ్ట్ వేర్ ని తయారు చేసి ఇస్తుంది. అయితే అందులో కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. తండ్రిని చూసుకుంటూ, ఓ ప్రక్కన తన వృత్తిలో వచ్చే సమస్యలు చూసుకుంటూ.. తమ పాత ఇంటిని అమ్మే ప్రయత్నాల్లో ఉంటుంది అను. అయితే ఆ ఇంటిని అమ్మటం తండ్రికి ఇష్టం ఉండదు. ఉన్మాదిలా బిహేవ్ చేస్తూంటాడు.  ఓ రోజు రాత్రి అనుకోకుండా  ఆ ఇంట్లో ఓ మహిళ దారుణ హత్యకు గురవుతుంది. అక్కడే ఆమె తండ్రి గణేష్ ఉండటం చూసిన అను..ఇరుక్కోకుండా వెంటనే సాక్ష్యాలు మాయం చేసి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది.  అయితే ఆమె ప్లానింగ్ , ముందు జాగ్రత్తతో పోలీసులకు ఏ విధమైన ఎవిడెన్స్ లు ఆ మర్డర్ కు సంభందించి దొరకవు.  ఈ గొడవలో ఆమె ఉండగానే... మరో రెండు మర్డర్లు జరుగుతాయి. అప్పుడు రంగంలోకి దిగుతాడు మాజీ పోస్ట్ మార్టం డాక్టర్ ఏసు(పశుపతి). ఏసు దో డిఫరెంట్ క్యారక్టర్. ఇన్విస్టిగేషన్ లో అతనికి దొరికిన క్లూలు కేసుని కొత్త మలుపు తిప్పుతాయి. ఇంతకీ ఎవరు ఈ హత్యలు చేస్తోంది. ఎందుకు చేస్తున్నారు. ఆ మర్డర్ కేసులో చనిపోయింది ఎవరు..వారికి అనురాధకు ఏమన్నా సంభందం ఉందా, తన తండ్రిని ఈ కేసులో ఇరుక్కోకుండా కాపాడుకోగలిగిందా...వంటి విషయాలన్నీ తెలియాలంటే వెబ్ సీరిస్ చూడాలి 

Latest Videos

undefined

ఎలా ఉంది...

మనకు వెబ్ సీరిస్ అంటే క్రైమ్ థ్రిల్లర్ అనే ముద్రపడిపోయింది. ఈ సీరిస్ కూడా అదే రూటులో ప్రయాం పెట్టుకుంది. అగాధా క్రిస్టి టైప్ ఓ  క్లాసిక్ మర్డర్ మిస్టరీ చూడబోతున్నాం అన్నట్లుగా ఫస్ట్ ఎపిసోడ్‌ను ఇంట్రస్టింగ్ గా మలిచి తర్వాత ఎపిసోడ్స్‌పై మరింత క్రేజ్‌ను పెంచేలా దర్శకుడు ఇంద్ర సుబ్రమణ్యం సఫలమయ్యారు.వాస్తవానికి మర్డరి మిస్టరీ డైప్ కథల్లో ..నవంబర్ స్టోరీలో డిఫరెంట్ . ఇందులో ఏడు ఎపిసోడ్లు మొదట ఎపిసోడ్ లాగే పరుగులు పెడుతుందని ఆశిస్తాం. కానీ అనుకున్న స్దాయిలో ముందుకు వెళ్లదు. చాలాసాగతీత ఉంది. లాగినట్లుగా సీరిస్ ని డిజైన్ చేసారు. విషయం తక్కువ విశ్లేషణ ఎక్కువ అన్నట్లు సాగింది. క్యారక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి కథలోకి వెళ్లటానికి టైమ్ ఎక్కువ తీసుకున్నారనిపించింది. అలాగే ఓ మాదిరి ప్రేక్షకుడు..ఇందులో మర్డర్స్ ఎవరు చేస్తున్నాడో కనిపెట్టేయగలరు. ఎంత స్లోగా ఈ సీరిస్ నడుస్తుందంటే మన చేతిలో ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉందనే విషయం మర్చిపోయారు. దానికి తోడు బ్లాక్ అండ్ వైట్ లోసాగే ప్లాష్ బ్యాక్ ఒకటి విసిగిస్తుంది. ఏదైమైనా తమన్నా వెబ్ సీరీస్ గా చేయదగ్గ కంటెంట్ అయితే మాత్రం కాదు. 

టెక్నికల్ గా...

ఇలాంటి కథలకు బ్యాక్ బోన్ గా నిలవాల్సిన శరణ్ రాఘవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విధు అయ్యన్న ఛాయాగ్రహణం బాగా కలిసి వచ్చాయి .  వెబ్ సీరిస్ అయినా సినిమా స్టాండర్డ్ క్వాలిటీని చూపించేందుకు కష్టపడ్డారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. లాస్ట్ ఎపిసోడే విసిగిస్తుంది. ఎడిటర్ గోవిందస్వామి  తన డిపార్టమెంట్ కు న్యాయం చెయ్యలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది.

ఫైనల్ థాట్
తమన్నా ఉంది, అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి చూడచ్చు.

Rating : 3/5

ఎవరెవరు...

నటీనటులు: తమన్నా భాటియా, పశుపతి, జీఎం కుమార్, వివేక్ ప్రసన్న, అరుల్‌దాస్ తదితరులు
 రచన, దర్శకత్వం: ఇంద్ర సుబ్రమణ్యం,
 నిర్మాత: ఆనంద వికటన్ 
మ్యూజిక్: శరణ్ రాఘవన్
 సినిమాటోగ్రఫి: విధు అయ్యన్న
 ఎడిటర్: శరణ్ గోవింద్‌సామి 
ఓటీటీ స్ట్రీమింగ్: డిస్నీ+హాట్ స్టార్ 
రిలీజ్: 2021-05-20

click me!