Tamannaah: హృదయాలు దోచుకుంటున్న తమన్నా వీడియో.. చిన్న విషయమే, అయినా పొంగిపోతున్న ఫ్యాన్స్

Published : Aug 18, 2022, 09:41 AM IST
Tamannaah: హృదయాలు దోచుకుంటున్న తమన్నా వీడియో.. చిన్న విషయమే, అయినా పొంగిపోతున్న ఫ్యాన్స్

సారాంశం

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ తమన్నా ఒదిగి ఉంటుంది. అందుకే తమన్నా ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళదు. తమన్నా ఆఫ్ స్క్రీన్ లో సాఫ్ట్ గా హంబుల్ గా ఉండే పర్సన్ ని ప్రశంసిస్తుంటారు. తాజాగా తమన్నా మరోసారి తన ప్రత్యేక చాటుకుంది. అభిమానుల చేత శబాష్ అనిపించుకుంటోంది. తమన్నా రీసెంట్ గా ఇండియన్ ఫిలిం ఫెస్టివెల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డ్స్ (IFFM) వేడుక లాంచింగ్ కార్యక్రమానికి హాజరైంది. 

ఈ కార్యక్రమంలో వేదికపై ఉన్న ప్రముఖులు దీపం వెలిగించి లాంచ్ చేశారు. తమన్నాతో పాటు తాప్సి కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. అక్కడున్న వారంతా షూ, చెప్పులు ధరించే దీపం వెలిగించారు. కానీ తన వంతు వచ్చినప్పుడు తమన్నా మాత్రం షూ రిమూవ్ చేసి దీపం వెలిగించింది. 

దీనితో తమన్నాపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నాయి. మన సంప్రదాయాల్ని తమన్నా లాంటి సెలెబ్రిటీ అన్ని చోట్లా పాటించడం గొప్ప విషయం అని అంటున్నారు. ఇది చిన్న విషయమే కావచ్చు.. కానీ ఇలాంటివే గొప్పగా అనిపిస్తాయి అని కామెంట్స్ చేస్తున్నారు. మన సంప్రదాయాలపై ఆమెకు ఉన్న గౌరవం అది.. తమన్నాని తప్పకుండా అభినందించాలి అని నెటిజన్లు తమన్నా పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?