స్పోర్ట్స్ డ్రామా అనగానే తెలుగులో మనకు ఈ మధ్యన వచ్చిన నాని 'జెర్సీ' అంతకు ముందు రాజమౌళి తీసిన 'సై' సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ సినిమాలను మించిన కంటెంట్ ఉంటేనే కొత్త కటౌట్ లు నిలబడతాయి. సందీప్ కిషన్ హిట్టైన ఓ తమిళ రీమేక్ తో తొలి హాకీ చిత్రం అనే కాప్షన్ తో తన సెంటిమెంట్ టైటిల్ అయిన ఎక్సప్రెస్ తో మన ముందుకు వచ్చాడు. ఈ ఎక్సప్రెస్ ఏ స్దాయిలో దూసుకుపోయింది. ఎక్కడైనా బ్రేక్ లు పడిందా...జనాలకు పెద్దగా తెలియని స్పోర్ట్స్ హాకీ నేపధ్యం ఏ మేరకు ఆకట్టుకుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్పోర్ట్స్ డ్రామా అనగానే తెలుగులో మనకు ఈ మధ్యన వచ్చిన నాని 'జెర్సీ' అంతకు ముందు రాజమౌళి తీసిన 'సై' సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ సినిమాలను మించిన కంటెంట్ ఉంటేనే కొత్త కటౌట్ లు నిలబడతాయి. సందీప్ కిషన్ హిట్టైన ఓ తమిళ రీమేక్ తో తొలి హాకీ చిత్రం అనే కాప్షన్ తో తన సెంటిమెంట్ టైటిల్ అయిన ఎక్సప్రెస్ తో మన ముందుకు వచ్చాడు. ఈ ఎక్సప్రెస్ ఏ స్దాయిలో దూసుకుపోయింది. ఎక్కడైనా బ్రేక్ లు పడిందా...జనాలకు పెద్దగా తెలియని స్పోర్ట్స్ హాకీ నేపధ్యం ఏ మేరకు ఆకట్టుకుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
సందీప్ నాయుడు(సందీప్ కిషన్) కు ఫ్యాన్స్ వెళ్లి సెటిల్ అవ్వాలనేది జీవితాశయం. అందుకోసం యానాం వెళ్లిన సందీప్ కు అక్కడ లావణ్య రావు(లావణ్య త్రిపాఠి) ని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె ఓ హాకీ ప్లేయర్. ఆమె కోసం హాకీ స్టేడియం కు రోజూ వెళ్తూంటాడు. తన వెనక పడుతున్న సందీప్ ని మొదట్లో లైట్ తీసుకున్న లావణ్య అతి త్వరలోనే ఐటూ లవ్ యూ అనేస్తుంది. ఈ లోగా ఓ కార్పోరేట్ కంపెనీ కన్ను ఆ హాకీ గ్రౌండ్ పై పడుతుంది. తమ మెడికల్ ల్యాబ్ ని సముద్రం ఒడ్డున ఉన్న ఆ హాకీ గ్రౌండ్ లో పెడితే..వ్యర్దాలను సముద్రంలో కలిపేయటం ఈజీ అవుతుందని ప్లాన్ చేస్తారు. అందుకోసం స్పోర్ట్స్ మినిస్టర్ (రావు రమేష్) తో డీల్ సెట్ చేసుకుంటాడు.
undefined
ఈ విషయం కోచ్ (మురళి శర్మ)కు తెలుస్తుంది. నేషనల్ లెవల్ టోర్నమెంట్ గెలిస్తే .. తమ గ్రౌండ్ దక్కించుకోవచ్చని కోచ్ కు తెలుస్తుంది. దాంతో యానాం టీమ్ కు నేషనల్ ప్లేయర్స్ కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు సందీప్ రంగంలోకి దూకుతాడు. అతను ఆటకు దూరంగా ఉంటున్న ఎక్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అని తెలుస్తుంది. అక్కడ నుంచి అసలు సందీప్ ఎందుకు ఇన్నాళ్లూ హాకీ ఆటకు దూరంగా ఉన్నాడు. నేషనల్ లెవిల్ టోర్నమెంట్ గెలిచి.. గ్రౌండ్ సొంతం చేసుకున్నారా, సందీప్ ప్రేమ కథ చివరకు ఏ మలుపుతిరిగింది..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్పోర్ట్స్ డ్రామాకూ..'భాషా' స్క్రీన్ ప్లేనే
ఆ మధ్యన వరసపెట్టి భాషా స్క్రీన్ ప్లేతో సినిమాలు వచ్చేవి...హీరో ని సామాన్యుడుగా చూపెట్టి..ఇంట్రెవెల్ ముందు అతని ఐడింటెంటీని రివీల్ చేసి,అక్కడ నుంచి అతని ప్రతాపం చూపెట్టి,విలన్స్ పై వీరోచిత పోరాటంతో క్లైమాక్స్ ముగించటం. అయితే ఎందుకనో ఆ స్క్రీన్ ప్లేలు తగ్గాయి. అయితే స్పోర్ట్స్ డ్రామాకు కూడా అలాంటి స్క్రీన్ ప్లే ..ప్లే చేసాడీ దర్శకుడు. ఈ సినిమా..ప్రారంభం హీరో...హీరోయిన్ ..లావణ్య వెనక పడటం అనే మామూలు ప్రతీ సినిమాలోనూ కనపడే లవ్ స్టోరీతో మొదలైంది. అసలు కథ సినిమాలో ప్రీ ఇంటర్వెల్ దాకా కానీ మొదలు కాదు. అప్పటిదాకా అతను ఓ సాదా సాదా కుర్రాడు. సమరసింహా రెడ్డి సినిమానో, భాషా సినిమాలాగ అతను అజ్ఞాతంలో తన టాలెంట్ ని దాచేసుకుంటాడు.
అప్పటిదాకా ఓ మామూలుగా ఉన్న కుర్రాడు హఠాత్తుగా ఓ ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ అని రివీల్ అవుతాడు. అలా చేస్తే కిక్ ఇస్తుందని స్క్రీన్ ప్లేలో రాసుకున్నారు. కానీ అతను తన ఐడింటెటీని దాచేయటం వెనక ఉన్న కారణంకు సంభందించిన ఫ్లాష్ బ్యాక్.. సెకండాఫ్ లోకి తోయకుండా ఫస్టాఫ్ లోనే చూపించేస్తే..సెకండాఫ్ లో అసలు ఛాలెంజ్ ఉండేది. అలా చేయకపోవటంతో సెకండాఫ్ లో సందీప్ ప్లాష్ బ్యాక్ కే సమయం తినేసింది. అది ఇంట్రస్టింగ్ గా ఉందా లేదా అనేది ప్రక్కన పెడితే..సందీప్ ఎప్పుడు స్టిక్ పట్టుకుని...గ్రౌండ్ లోకి దూకుతాడా అని ఎదురుచూసే ప్రేక్షకుడు ఆ టైమ్ ..కిల్లింగ్ గా కనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ సినిమా కు హైలెట్ కాబట్టి ఉన్నంతలో సంతృప్తి కలిగిస్తుంది.
అలాగే ఈ మధ్యన తెలుగులోనూ క్రీడా నేపధ్యం ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. రీసెంట్ గా చెస్ నేపధ్యంలో వచ్చిన నితిన్ చెక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా. అలాగే పూర్తిగా క్రీడలతోనే నడిపేద్దామన్నా మనవాళ్లు కు ఎక్కదు. జెర్సీ సినిమా అంత సక్సెస్ సాధించటానికి కారణం అందులో నానికు, అతని కొడుకుకి ఉన్న ఎమోషనల్ బాండిగ్...సెంటిమెంట్ సినిమాని నిలబెట్టిందనే విషయం మర్చిపోకూడదు. ఇక్కడ ఈ సినిమాలో అదే మిస్సైంది.
దర్శకత్వం మిగతా విభాగాలు...
తమిళంలో ఆల్రెడీ తీసిన సినిమానే చిన్న చిన్న మార్పులతో అదే దర్శకుడు తెలుగులోకి రీమేక్ పేరుతో దించాడు. కాబట్టి డైరక్షన్ విషయమై మాట్లాడుకునేది ఏమీ లేదు. అలాగే రొటీన్ గా అనిపించినా ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ లో లావణ్య నచ్చేస్తుంది. అలాగే రావు రమేష్ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఎప్పటిలాగే వెటకారంతో పాత్రను పండించారు. సత్య, మహేష్ విట్టలు బాగానే నవ్వించారు. మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాఫ్ తమిళ..పాటల కన్నా బ్యాక్ గ్రౌండ్ బాగుంది., కవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అన్నట్లుంది. చోట కె ప్రసాద్ ఎడిటింగ్ ఫస్టాఫ్ లో ఉన్నట్లుగా.. సెకండాఫ్ లో షార్ప్ గా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సందీప్ కిషన్ కష్టం ..ఈ సినిమాని చాలా చోట్ల వన్ మ్యాన్ షోగా మార్చేసాయి. లావణ్య త్రిపాఠి..గ్లామర్ షోకు కుర్రాళ్లు ఫిదా అవుతారు.
ఫైనల్ థాట్
ఈ మాత్రం కథలు మన తెలుగు డైరక్టర్స్ చేయగలరు..మరీ రీమేక్ చేసేటంత సినిమా అయితే కాదు.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
ఎవరెవరు..
నటీనటులు : సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, సత్యా, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం : హిప్ హాప్ తమిళ
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
సినిమాటోగ్రఫీ : కెవిన్ రాజ్
నిర్మాతలు : టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం : డెన్నిస్ జీవన్ కనుకొలను
విడుదల తేది : మార్చి 05, 2021