Vikram:కమల్ హాసన్ 'విక్రమ్‌' ఓటిటి రిలీజ్ డిటేల్స్

Surya Prakash   | Asianet News
Published : Jun 04, 2022, 12:56 PM IST
Vikram:కమల్ హాసన్ 'విక్రమ్‌' ఓటిటి  రిలీజ్ డిటేల్స్

సారాంశం

కమల్ తోపాటు ప్రముఖ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ యాక్ట్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎప్పుడు విడుదలవుతందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసారు.   


 యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘విక్రమ్’. కమల్ తోపాటు ప్రముఖ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ యాక్ట్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎప్పుడు విడుదలవుతందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసారు.  ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’ జూన్ 3న విడుదల అయ్యింది.  కమల్ అభిమానులు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి.  ఈ సినిమాకు తమిళంలో హిట్ టాక్ వచ్చింది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ వివరాలు బయిటకు వచ్చాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని  Disney+ Hotstar వారు సొంతం చేసుకున్నారు. మరో ప్రక్క స్టార్ మా వారు ఈ చిత్రం తెలుగు శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న కరెంట్ ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం ఓటిటి లో ఈ చి్తరం రిలీజైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో విక్రమ్ ని జూలై మొదటి వారంలో ప్రీమియర్ అయ్యే అవకాసం ఉంది. 

చిత్రం కథలో .. సంతానం (విజయ్ సేతుపతి) కి చెందిన  2 లక్షల కోట్ల విలువైన ముడి  డ్రగ్స్   కంటైనర్‌లు మిస్సవుతాయి. ఈ డబ్బు బయిటకు వస్తే... ఓ సమాంతర ప్రభుత్వాన్ని నడిపేయచ్చు. ఇప్పుడా డ్రగ్స్ కంటైనర్స్ పట్టుకోపోతే తన పైనున్న బాస్ ఊరుకోడు. ఎలాగైనా వాటిని పట్టుకోవాలి. ప్రాణాలు తెగిస్తారు. డ్రగ్స్ తీసుకుని మరీ రంగంలోకి దూకుతాడు. మరో ప్రక్క సిటీలో వరస మర్డర్స్. ఓ ముసుగు మనిషి ఇవన్నీ చేస్తున్నాడు. ఎవరా ముసుకు వీరుడు అని  అండర్ కవర్ పోలీస్ అమర్ ( ఫహద్‌ ఫాజిల్‌) సీన్ లోకి వస్తాడు. ఇన్విస్టిగేట్ చేస్తాడు. ఈ క్రమంలో కన్నన్ (కమల్) పాత్ర బయిటకు వస్తుంది. అతను ఎవరు...ఈ డ్రగ్స్ కు , ఈ ముసుగు వీరుడుకు లింక్ ఉందా... ముఖ్యంగా కమల్ పాత్ర పేరు కన్నన్ అయితే  విక్రమ్ ఎవరు ...అనేది సస్పెన్స్. 
  

ఇక తెలుగులో  ఈ చిత్రం తెలుగు రైట్స్ ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు.  ఒకప్పుడు కమల్ హాసన్ తెలుగు హీరోలతో సమానంగా ఫాలోయింగ్ ఉండేది. ఆయన సినిమా విడుదల అవుతుంటే.. మన హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి భయపడేవారు. రాను రాను తెలుగులో కమల్ హాసన్ మార్కెట్ దారుణంగా పడిపోయిందనే చెప్పాలి. కానీ లోకేష్ కనగరాజ్‌కు గత రెండు సినిమాలు ‘ఖైదీ’, ’మాస్టర్’  తెలుగులో సూపర్ హిట్ కావడంతో ఇపుడు ఈ సినిమా తెలుగు హక్కులకు భారీ రేటు దక్కింది.
 
విక్రమ్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేసారు. ప్రధాన తారాగణంలో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ చిత్రానికి సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేసారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు విజువ‌ల్స్ అందించిన ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేసారు.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే