శివానీ రాజశేఖర్ తొలి చిత్రమే మూలన పడింది. ఈ లోగా శివాని చెల్లెలు శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. దొరసాని సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి శివానీ సినిమా ఎప్పుడన్న చర్చ మొదలైంది.
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన అందాల భామ శివానీ రాజశేఖర్. అందంతో పాటు అభినయంలోనూ మెళకువలు నేర్చకున్న ఈ భామ 2018లో హీరోయిన్‌గా తెరంగేట్రానికి రెడీ అయ్యింది. హిందీలో సూపర్ హిట్ అయిన 2 స్టేట్స్ రీమేక్‌తో శివానీని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ సినిమాలో హీరోగా అడివి శేష్‌ను తీసుకున్నారు. వెంకట్ కుంచం అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించేందుకు రెడీ అయ్యాడు. కొద్ది రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తరువా ఆగిపోయింది. కారణాలు వెల్లడించకపోయినా ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టే అని తెలుస్తోంది.
దీంతో శివానీ తొలి చిత్రమే మూలన పడింది. ఈ లోగా శివాని చెల్లెలు శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. దొరసాని సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి శివానీ సినిమా ఎప్పుడన్న చర్చ మొదలైంది. అయితే శివానీ వార్త సినిమాకు సంబంధించిన ప్రశ్న ఎప్పుడు ఎదురైనా దాట వేస్తూ వచ్చింది. తాజాగా ఈ అందాల భామ తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు శివానీ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాతో బాల నటుడిగా ఆకట్టుకున్న తేజ సజ్జ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే కథ కూడా ఓకె అయ్యిందని త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇక దర్శకుడు మల్లిక్ రామ్ విషయానికి వస్తే ఈ డైరెక్టర్ గతంలో సుమంత్ హీరోగా నరుడా డోనరుడా సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవటంతో మల్లిక్ కెరీర్ లో లాంగ్ గ్యాప్ వచ్చింది. మరి శివానీ, తేజల సినిమాతో అయినా ఈ దర్శకుడికీ బ్రేక్ వస్తుందా..? శివానీ తొలి చిత్రం పట్టాలెక్కుతుందా..? అన్న చర్చ జరుగుతోంది.