Shahrukh Khan: అంబులెన్స్ లో షారుఖ్ ఖాన్, బాలీవుడ్ బాద్ షాకు ఏమయ్యింది...?

Published : Apr 08, 2022, 01:57 PM IST
Shahrukh Khan: అంబులెన్స్ లో షారుఖ్ ఖాన్, బాలీవుడ్ బాద్ షాకు ఏమయ్యింది...?

సారాంశం

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ అంబులెన్స్ లో కనిపించారు. షారుక్ ముఖం కవర్ చేసుకుని అంబులెన్స్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ కింగ్ ఖాన్ కు ఏమయ్యింది.   


బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ అంబులెన్స్ లో కనిపించారు. షారుక్ ముఖం కవర్ చేసుకుని అంబులెన్స్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ కింగ్ ఖాన్ కు ఏమయ్యింది. 

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ కు  సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట హాల్‌చల్‌ చేస్తోంది. షారుఖ్ ఖాన్ అంబులెన్స్ లో ముఖాన్ని కవర్ చేసుకుని ఉన్న ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో వైరల్ కావడంతో అసలు బాలీవుడ్ బాద్ షా కు ఏమయ్యిందని ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే ఇద   ఓ షూటింగ్ సెట్ లోదంటూ కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 ఈ ఫోటో షూటింగ్ లో బాగంగా తీసిందని తెలుస్తోంది. రీసెంట్ గా స్పెయిన్‌లో పఠాన్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ఇటీవల షారుక్‌ ముంబైకి వచ్చింది.  ఈ క్రమంలో ముంబైలో షూటింగ్‌లో పాల్గొన్న కింగ్‌ ఖాన్‌ ఫొటో ఒకటి లీకైంది. ఇందులో షారుక్‌ అంబులెన్స్‌లో కూర్చోని ఉండగా చూట్టూ సిబ్బంది ఉన్నారు. ఇందులో షారుక్‌ మొహం కవర్‌ చేసి ఉంది. దీంతో ఇది ఏ మూవీ షూటింగ్‌ అయ్యింటుందని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు. 

 

అయితే దీనికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ ఇది డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్‌ ఖాన్‌  లయన్‌ మూవీ సెట్‌లోనిది అయ్యింటుందని అభిప్రాయపడుతున్నారు.అంతేకాదు ఈ ఫొటోను షేర్‌ చేస్తూ అట్లీ, లయన్‌ పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ను వైరల్‌ చేస్తున్నారు. లయన్‌ మూవీలో షారుక్‌ సరసన సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార  హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ సినిమా గతేడాది 2021లో ఈ మూవీ సెట్స్‌పైకి  వచ్చింది. అయితే ఓ షెడ్యూల్ షూటింగ్ లో కోన్ని  సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌ను జరుపుకుంది. ఈ క్రమంలో షారుక్‌ పఠాన్‌ షూటింగ్‌, నయన తారా బిజీ షెడ్యుల్‌ కారణంగా  షూటింగ్ కు బ్రేక్‌ పడింది. అయితే షారుక్‌ స్పెయిన్‌ నుంచి తిరిగి రావడం, హీరోయిన్‌ నయన తార ఏప్రిల్‌ 6న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో లయన్‌ మూవీ షూటింగ్‌ తిరిగి స్టార్ట్ అయ్యిందని  హింట్ ఇచ్చారు టీమ్.  ఇక షారుఖ్ ఖాన్ పఠాన్‌ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇందులో షారుక్‌ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు