Sanjay Dutt Comments: ఆ విషయం తెలియగానే కొన్ని గంటల పాటు ఏడ్చాను: సంజయ్ దత్

Published : Apr 17, 2022, 04:05 PM ISTUpdated : Apr 17, 2022, 04:08 PM IST
Sanjay Dutt Comments: ఆ విషయం తెలియగానే కొన్ని గంటల పాటు ఏడ్చాను: సంజయ్ దత్

సారాంశం

బాలీవుడ్ స్టార్ స్టార్ హీరో సంజయ్ దత్ అంటే భారీ కాయంతో... దాదాలా ఉంటాడు. అందరూ అలానే పిలుస్తారు కూడా.. కాని అంతటి సంజయ్ దత్ ఏడ్చే సందర్భం వస్తే..?  ఆసందర్భం నిజంగా జరిగింది, అదిస్వంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సంజయ్ దత్.  

బాలీవుడ్ స్టార్ స్టార్ హీరో సంజయ్ దత్ అంటే భారీ కాయంతో... దాదాలా ఉంటాడు. అందరూ అలానే పిలుస్తారు కూడా.. కాని అంతటి సంజయ్ దత్ ఏడ్చే సందర్భం వస్తే..?  ఆసందర్భం నిజంగా జరిగింది, అదిస్వంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సంజయ్ దత్.

సంజయ్ దత్ బాలీవుడ్ కు దాదా... హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన సంజయ్.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. కాని ఏనాడు తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఏడాడు భయపడలేదు. ఏడ్వలేదు. కాని తను ఓ సంఘటన విషయంలో మాత్రం బోరున ఏడ్చాడ. అది కూడా గంటల తరబడి. మరి సంజయ్ లాంటి స్ట్రాంగ్ పర్సన్ చేత కూడా కంటతడి పెట్టించిన ఆసంగటన ఏంటీ..?  

సంజయ్ దత్ ప్రస్తుతం కెజియఫ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయ్యంది. ఈసినిమాలో అధీరాగా ఆయన పాత్రకు 100కు వంద శాతం మార్కులుపడ్డాయి. హీరోకి సరిసమానమైన పాత్రలో అలరించి మెప్పించాడు సంజయ్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో సంజయ్ దత్ కోన్ని విషయాలు పంచుకున్నారు. 

తనకు కేన్సర్ సోకిందని తెలియగానే.. కొన్ని గంటలపాటు ఏడ్చినట్టు బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సంజయ్ దత్ పంచుకున్నారు. కేన్సర్ అని నాకు చెప్పిన వెంటనే ఏడుపు ఆగలేదు. నా కుటుంబం, నా జీవితం ఏమైపోతుందా అన్న భయం నన్ను ఆవహించిందని అన్నారు. తాను కేన్సర్ పై ఎలా పోరాడి గెలిచింది ఆయన వివరించారు. కీమో థెరపీతో ఎన్నో దుష్ప్రభావాలు ఎదురవుతాయన్న డాక్టర్ హెచ్చరికలను..చెపుతూనే  ఏమీ కాదంటూ భరోసా ఇవ్వడాన్ని గుర్తు చేసుకున్నారు.

2020 ఆగస్ట్ లో సంజయ్ కు లంగ్ కేన్సర్ ఉన్నట్టు బయటపడింది.  ఈ విషయం గురించి ఆయన చెపుతూ..ఒక రోజు మెట్లు ఎక్కుతుంటే శ్వాస ఆడ లేదు. స్నానం చేస్తున్నా అంతే. దాంతో డాక్టర్ కు కాల్ చేశాను. ఎక్స్ రేలో ఊపిరితిత్తుల్లో సగం మేర నీరు చేరినట్టు గుర్తించారు. దాన్ని టీబీ అనుకున్నారు. కానీ, అది కేన్సర్ అని తేలింది అంటూ అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు సంజయ్. 

అయితే ఫారెన్ వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకోవాలి అని సంజయ్ అనుకున్నారట. ముందు వీసా లభించలేదు. భారత్ లోనే చికిత్స తీసుకోవాలని అనుకున్నారట. తర్వాత నటుడు, నిర్మాత రాకేష్ రోషన్ ఓ డాక్టర్ ను సంజయ్ కు సూచించారు. దుబాయిలో కీమో థెరపీ తీసుకునే సమయంలో రోజూ బ్యాడ్మింటన్ రెండు మూడు గంటల పాడు ఆడాను. కూర్చుని సైకిల్ తొక్కడం చేసాను. మొత్తానికి కేన్సర్ ను సంకల్ప బలంతో, మనో ధైర్యంతో జయించినట్టు సంజయ్ గర్వంగా చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?