డీజే టిల్లు రాధికతో రొమాన్స్ కి సిద్దమైన 'రూల్స్ రంజన్'!

Published : Jun 21, 2022, 02:45 PM IST
డీజే టిల్లు రాధికతో రొమాన్స్ కి సిద్దమైన 'రూల్స్ రంజన్'!

సారాంశం

'రూల్స్ రంజన్' మూవీతో క్రేజీ కాంబో సెట్ చేశారు దర్శకుడు రతినం కృష్ణ. యస్ ఆర్ కల్యాణమండపం హీరో, డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు.   

'రాజావారు రాణిగారు', 'యస్.ఆర్.కళ్యాణ్ మండపం'  వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'రూల్స్ రంజన్'. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు పాల్గొనగా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాకి హీరోయిన్ కూడా కన్ ఫార్మ్ అయ్యింది. 'డి.జె.టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించనుంది. 'యస్.ఆర్.కళ్యాణ్ మండపం' తో కిరణ్ అబ్బవరం, 'డి.జె.టిల్లు' తో నేహా శెట్టి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి 'రూల్స్ రంజన్' (Rules Ranjan) చిత్రంలోనటించనుండటంతో  సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. 

మరోవైపు కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే (Sammathame) విడుదలకు సిద్ధమైంది. జూన్ 24న సమ్మతమే విడుదల కానుంది. కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా గోపినాధ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైన్ పై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. హీరో కిరణ్ వినూత్నంగా సమ్మతమే మూవీ ప్రమోషన్స్ నిర్వహించారు. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే