RRR Movie: ఎన్టీఆర్, రాంచరణ్ లకు ముంబైలో సన్మానం.. హాజరు కానున్న అమీర్ ఖాన్ ?

Published : Apr 06, 2022, 06:38 AM IST
RRR Movie: ఎన్టీఆర్, రాంచరణ్ లకు ముంబైలో సన్మానం.. హాజరు కానున్న అమీర్ ఖాన్ ?

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ చిత్ర వసూళ్ల జోరు తగ్గడం లేదు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ చిత్ర వసూళ్ల జోరు తగ్గడం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ 1000 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది. ఊహించిన విధంగానే ఆర్ఆర్ఆర్ ఘనవిజయం సాధించడంతో చీర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఉంది. 

రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. నైజాం ఏరియాలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది ఆయనే. కేవలం నైజాంలో మాత్రమే ఆర్ఆర్ఆర్ మూవీ 100 కోట్ల షేర్ కు చేరువైంది. ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ప్రభంజనం దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. రాధే శ్యామ్ చిత్రంతో నష్టపోయినప్పటికీ.. ఆర్ఆర్ఆర్ చిత్రం దిల్ రాజుకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. 

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ సంస్థ కూడా గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేస్తోందట. బుధవారం సాయంత్రం ముంబైలో గ్రాండ్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి ఆర్ఆర్ఆర్ టీంతో పాటు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా హాజరు కాబోతున్నట్లు టాక్. 

సక్సెస్ పార్టీలో అమీర్ ఖాన్ రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి లని సన్మానించబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ బెల్ట్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం 200 కోట్ల నెట్ వైపు దూసుకుపోతోంది. ప్రతి రోజు హిందీలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి సాలిడ్ నంబర్స్ నమోదవుతున్నాయి. పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. 

అమీర్ ఖాన్ తో పాటు ఇంకెవరైనా బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ పార్టీకి హాజరవుతారేమో చూడాలి. అజయ్ దేవగన్ ఈ చిత్రంలో రాంచరణ్ తండ్రిగా పవర్ ఫుల్ రోల్ లో నటించారు. ఎన్టీఆర్, రాంచరణ్ నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?