Ravi Teja: మాస్ మహారాజ్ దూకుడు, రామారావు ఆన్ డ్యూటీ నుంచి అప్ డేట్ రెడీ

Published : Apr 07, 2022, 04:32 PM ISTUpdated : Apr 07, 2022, 04:40 PM IST
Ravi Teja: మాస్ మహారాజ్ దూకుడు, రామారావు ఆన్ డ్యూటీ నుంచి అప్ డేట్ రెడీ

సారాంశం

మాస్ మహారాజ్ రవితేజ దూకుడు చూపిస్తున్నారు. వరుస సినిమాలను సెట్స్ ఎక్కిస్తూ.. వాటిని కంప్లీట్ చేస్తూ.. అప్ డేట్స్ వదులతూ.. నాన్ స్టాప్ హంగామా చేస్తున్నాడు. ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో రామారావ్ ఆన్ డ్యూటీ మూవీ.. అలా అప్ డేట్ కు రెడీ అయ్యింది.   

రవితేజ జోరుమీద ఉన్నాడు. సినిమా మీద సినిమాచేస్తూ..దూకుడు చూపిస్తున్నాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. 

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ లో బిజీ బిజీ గా ఉన్నారు యూనిట్. రిలీజ్ కు ముస్తాబు చేస్తున్నారు సినిమాను. 

రిలీజ్ డేట్ కు ముందే వరుస అప్ డేట్స్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ  సినిమా నుంచి మొదటి పాట గా బుల్ బుల్ తరంగ్ ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. రవితేజ, రజిషా విజయన్ పై ఈ సాంగ్ ను చిత్రీకరించారు.ఈ లవ్లీ ..ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంటుంది. ఫారిన్ డ్యాన్సర్ల తో స్పెయిన్‌లో ఈ పాటని చాలా లావిష్ గా షూట్ చేసినట్టు మూవీ టీమ్ చెపుతున్నారు. ఇక ఈరోజు ( ఏప్రిల్  7) విడుదల చేసిన పోస్టర్లో రవితేజ, రజిషా జోడి బ్యూటిఫుల్ అండ్ స్టయిలీష్ గా వుంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఫుల్ ప్యాకడ్ యాక్షన్ తో నిండిన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలని పెంచాయి. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దివ్యాంశ కౌశిక్‌ మరో హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీని జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?