
సోషల్ మీడియాలో హీరోల గొప్పల గురించి చెప్పుకోవటం, యుద్దాలు జరగటం చాలా కామన్. ఫ్యాన్స్ వాటిని ఎంజాయ్ చేస్తూంటారు. అదో కాలక్షేపంగా భావిస్తూంటారు. అదే సమయంలో తమ హీరోని ఎవరైనా ఏమైనా అంటే ఒప్పుకోరు కూడా. అంతేకాదు మా హీరోను మించినవాడు లేడు.. మా హీరో రికార్డులు బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు అలా వేరే ఇతర హీరోల ఫ్యాన్స్ తో కయ్యానికి కాలు దువ్వుతుంటారు. అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా రాంచరణ్-యశ్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఇది హీరోల స్టార్ స్టేటస్ గురించో... లేక రికార్డుల గురించో కాదు... గడ్డం గురించి ని అంటున్నా ఇది ఓ పెయిడ్ ట్రెండ్ అని కొందరు తేలుస్తున్నారు.
రాంచరణ్-యశ్.. ఈ ఇద్దరిలో ఎవరి గడ్డం బాగుందంటూ ట్విట్టర్‌లో ఫ్యాన్స్ యుద్దం చేయటం వెనక కావాలని #RamVsYash హాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ కావాలనే కొందరు మొదెలెట్టారు అంటున్నారు. అయితే ఎవరిదా పని...ఏమిటి వారి ఉద్దేశ్యం ...
వాస్తవానికి రాంచరణ్ రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో గడ్డంతో కనిపించగా... యశ్ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాల్లో గడ్డంతో కనిపించారు. రాంచరణ్ ఫ్యాన్స్ తమ హీరో గడ్డమే బాగుందని కామెంట్స్ చేస్తుండగా... యశ్ ఫ్యాన్స్ తమ హీరో గడ్డమే బాగుందని ట్వీట్స్ చేస్తున్నారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు. అలా కాకుండా ఈ ట్వీట్ ట్రెండ్ వెనక ...ఎన్టీఆర్ ని సైడ్ చేయాలనే ఉద్దేశ్యం ఉంది అని కొందరు తేల్చి చెప్తున్నారు.
కేవలం రామ్ చరణ్, యష్ మధ్యే పోటీ పెట్టి వీళ్లిద్దరనే ప్రొజెక్టు చేస్తూ ఎన్టీఆర్ ని సైడ్ చేస్తున్నారని ,ఇదంతా పెయిడ్ ట్వీట్ల వ్యవహారం అని కొందరు సోషల్ మీడియా జనం అనుమానపడుతున్నారు. పైకి రామ్ చరణ్ ని, యష్ ని కంపేర్ చేస్తున్నట్లు కనపడుతూనే ఎన్టీఆర్ ని సైడ్ చేసారని ఎనాలసిస్ చేసి చెప్తున్నారు. ఇది పెయిడ్ ట్విట్టర్ ట్రెండింగ్ అని.. కావాలనే ఉన్నట్టుండి ఈ హాష్ ట్యాగ్‌ను తెర పైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు.
రాంచరణ్-యశ్ మధ్య పోలిక తీసుకురావడమంటే పరోక్షంగా ఎన్టీఆర్ బిగ్ స్టార్ రేసులో లేడని చెప్పడమేనని... ఎన్టీఆర్ కన్నా రాంచరణ్ పెద్ద స్టార్ అని చెప్పేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏది నిజమో..ఏది అబద్దమో తెలియాలంటే ఫ్యాన్సే స్వయంగా పూనుకుని ఆ ట్రెండ్ ఎక్కడ ఎవరు మొదలెట్టారో చూడాలి..చెక్ చేయాలి.