వరుసగా దెబ్బలు తగులుతున్న మారనంటోన్న రామ్, బోయపాటి సినిమా కూడా ప్రయోగమేనా...?

Published : Aug 29, 2022, 11:32 AM IST
వరుసగా దెబ్బలు తగులుతున్న మారనంటోన్న రామ్, బోయపాటి సినిమా కూడా ప్రయోగమేనా...?

సారాంశం

వరుస ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేస్తున్నాడు యంగ్ హీరో రామ్ పోతినేని. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ.. బోక్కబోర్లా పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత వరుస ప్లాప్ లతో ఇబ్బందులు పడుతున్నాడు. అయినా తగ్గేది లేదంటున్నాడు.   

వరుస ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేస్తున్నాడు యంగ్ హీరో రామ్ పోతినేని. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ.. బోక్కబోర్లా పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత వరుస ప్లాప్ లతో ఇబ్బందులు పడుతున్నాడు. అయినా తగ్గేది లేదంటున్నాడు. 

ఎందో రామ్ కు మాస్ ఇమేజ్ కోరిక గట్టిగా పట్టుకుంది. చాక్లెట్ బాయ్ గా స్మార్ట్ హీరోగా.. ఉన్న రామ్.. తరువాత  తరువాత మాస్ హీరోగా మారాలన్న కోరికతో ప్రయోగాలు మొదలెట్టాడు. అందులో భాగంగానే పూరీ డైరెక్షన్ లో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. అదే ఫార్ములాతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానా ఇస్మార్ట్ శంకర్ తరువాత చేసిన రెండు ఊర మాస్ సినిమాలు రామ్ కు గట్టి దెబ్బ తగిలేలా చేశాయి. ఇక అయినా సరే మళ్లీ మాస్ ప్రయోగానికే రెడీ అవతున్నాడు రామ్. 

ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ చేసిన రెడ్, ది వారియర్  సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక నెక్ట్స్ సినిమాను బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్నాడు రామ్. రామ్ ప్లాప్ లతో ఉంటే.. బోయపాటి మాత్రం బాలయ్య తో  అఖండ సినిమా అఖండ విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్నాడు. అఖండ సక్సెస్ తరువాత బోయపాటిపై  నెక్ట్స్ సినిమాపై సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన అందరూ కూడా ఈ సినిమాపై దృష్టి పెట్టారు.

ఇక బోయపాటి అటే మాస్.. మాస్ అంటే బోయపాటి... రామ్ తో చేయబోయే సినిమా కూడా మాస్ సినిమానే ని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ ముందుగానే బయటికి వచ్చింది. ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యం పూర్తి భిన్నంగా ఉంటుందట. అందులో ఒక పాత్ర కోసం రామ్ 10 కేజీలకి పైగా బరువు పెరగనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నాడట రామ్.  

ఇక్కడ మరో విషయం ఏంటీ అంటే..? రామ్ కు రెండు ప్లాప్ లు పడ్డాయి.. ఇప్పుడు బోయపాటి సినిమా హిట్ అవ్వకపోతే.. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ రికార్డ్ ఖాతాలో వేసుకునే ప్రమాదం ఉంది రామ్. అటు బోయాపాటి కూడా ఓ సూపర్ హిట్ కొడితే. నెక్ట్స్ సినిమాపై నమ్మకం తక్కువగానే ఉటుంది. మరి ఈ లెక్కన రామ్ రిస్క్ తీసకుుంటున్నాడనే అంటున్నారు ఆడియన్స్. ఒక వేళ హిట్ కొడితే మాత్రం రామ్ మాస్ హీరోగా సెట్ అయినట్టే అంటున్నారు. 

ది వారియర్  సినిమా కోసం ఆల్రెడీ  రామ్ కొంత వరకూ బరువు పెరిగాడు. ఇప్పుడు మరింత బరువు పెరగనున్నట్టు చెబుతున్నారు. ఇక  ఈ సినిమాలో  హీరోయిన్ గా  రష్మిక పేరు వినిపిస్తోంది. మాస్ అంశాలతోను .. ఎమోషన్స్ తోను కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. షూటింగ్ ఎప్పుడు..? మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనేది త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?