రకుల్ హాట్ లిప్ లాక్ వీడియో హల్చల్!

By Akshit Choudhary  |  First Published Jul 4, 2018, 2:51 PM IST

'కెరటం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో బ్రేక్ అందుకుంది. ఆ తరువాత కొన్నాళ్లకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది


'కెరటం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో బ్రేక్ అందుకుంది. ఆ తరువాత కొన్నాళ్లకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన రకుల్ ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. నిజానికి ఎప్పుడూ తెలుగు సినిమాలతో బిజీగా ఉండే రకుల్ చేతుల్లో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దీంతో అమ్మడు కొన్ని గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొని దర్శకనిర్మాతల దృష్టిలో పడే ప్లాన్ చేస్తోంది. నిజానికి సినిమాలలో పెద్దగా గ్లామర్ రసం ఒలికించని రకుల్ ఈ విధమైన ఫోటో షూట్ లలో పాల్గొనడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమె లిప్ లాక్ వీడియో ఒకటి ఆన్ లైన్ లో కనిపించడంతో ఇందులో కనిపిస్తున్నది రకులేనా అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 

Latest Videos

కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన ఓ లిప్ లాక్ సీన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తోటి ఆర్టిస్ట్ తో కలిసి రకుల్ పాల్గొన్న ఈ లిప్ లాక్ సీన్ ఎవరూ చూసిన షాక్ అవ్వాల్సిందే. అంతగా ఇన్వాల్వ్ అయిపోయి మరీ నటించింది. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి! 

 

click me!