
రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) నుంచి వస్తోన్న మరో బోల్డ్ మూవీ `డేంజరస్`(Dangerous Movie). ఇది తెలుగులో `నా ఇష్టం`గా విడుదల కాబోతుంది. అప్సరా రాణి, నైనా గంగూలీ జంటగా నటించిన ఈ చిత్రానికి వర్మ దర్శకుడు. లెస్బియన్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్ 8న) విడుదల కానుంది. దీన్ని పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు వర్మ. ఈ నేపథ్యంలో ఈ సినిమాని ప్రదర్శించేందుకు మల్టీ ప్లెక్స్ లు పీవీఆర్, ఐనాక్స్ లు తిరస్కరిస్తున్నారు. ఈ విషయాన్ని రామ్‌గోపాల్ వర్మ(RGV) వెల్లడించారు.
`లెస్బియన్ స్టోరీతో రూపొందిన మా `డేంజరస్` చిత్రాన్ని పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమా మల్టీప్లెక్స్ లు ప్రదర్శించేందుకు తిరస్కరించాయి. సుప్రీంకోర్ట్ 377సెక్షన్‌ని రద్దు చేశాక, సెన్సార్ బోర్డ్ క్లీయర్ సర్టిఫికేట్ ఇచ్చాక కూడా వీరు మా సినిమాని తిరస్కరించడం లెస్బియన్ల పట్ల వీరి వ్యతిరేక భావజాలాన్ని తెలియజేస్తున్నారు` అని వర్మ ట్వీట్ చేశారు. దీని ద్వారా స్వలింగ సంపర్కులను అవమానించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై లెస్బియన్ కమ్యూనిటీ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు నిలబడాలని వెల్లడించారు.
అంతేకాదు `ది కాశ్మీర్ ఫైల్స్` ని కపిల్ శర్మ ప్రమోట్ చేయడానికి నిరాకరించారు. ఇప్పుడు మా సినిమాలో ఈ రెండు మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రదర్శించేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటీ? `పీవీఆర్, ఐనాక్స్ లు మా `డేంజరస్` సినిమాని నిరాకరించడం ద్వారా లెస్బియన్లని అవమానించడమే కాదు, సుప్రీంకోర్ట్ ఆదేశాలను ధిక్కరించాయి. దీనిపై ప్రతి ఒక్కరు స్పందించాలని వర్మ వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించారు. ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్కం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు వర్మ.