project k:మీలో ఆ ట్యాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో సూపర్ ఆఫర్!

Surya Prakash   | Asianet News
Published : Apr 22, 2022, 11:37 AM IST
project k:మీలో ఆ ట్యాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో  సూపర్ ఆఫర్!

సారాంశం

బాహుబలి తర్వాత  వరుసగా ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు ప్రభాస్. రీసెంట్ గా  "రాధేశ్యామ్" సినిమాతో ఆ స్పీడుకు  బ్రేక్ పడ్డప్పటికీ, ప్రభాస్ చేతిలో ఇప్పుడు వరస భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.


బాహుబలి తర్వాత  వరుసగా ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు ప్రభాస్. రీసెంట్ గా  "రాధేశ్యామ్" సినిమాతో ఆ స్పీడుకు  బ్రేక్ పడ్డప్పటికీ, ప్రభాస్ చేతిలో ఇప్పుడు వరస భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక వైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో "ఆది పురుష్" మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో "సలార్" సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో "ప్రాజెక్ట్ కే" సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాలో చిత్ర యూనిట్ దాదాపు ఇండియన్ కాస్ట్ నే తీసుకుంటున్నారు.

టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చే విధంగా ఎన్నో ఆడిషన్స్ పెట్టిన చిత్ర టీమ్ తాజా మరో టాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇస్తున్నారు. ఈసారి తాము మంచి స్టంట్స్ వచ్చిన నటుల కోసం చూస్తున్నామని తెలిపారు. భారతీయ కళతో పాటు ఇతర మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్నవారు గాని లేదా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే తమ టాలెంట్ చూపించి ఈ భారీ సినిమాలో అవకాశం దక్కించుకోవచ్చని తెలిపారు. మరి మీలో కూడా ఆ ప్రతిభ ఉంటే వారు ఇచ్చిన మెయిల్ ద్వారా సంప్రదించి ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు. అయితే ఈసారి మార్షల్ ఆర్ట్స్, కళరి వంటి స్టంట్స్ తెలిసిన వారికి ప్రాధాన్యతను ఇచ్చింది ప్రాజెక్ట్ K టీమ్.
 

మీలో యాక్షన్ కొరియోగ్రఫీకి కావాల్సిన ట్యాలెంట్ ఉంటే వెంటనే ప్రాజెక్ట్ K టీమ్‌ను సంప్రదించాలని ప్రాజెక్ట్ K మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇలా ఈ సినిమాలో మెజారిటీ క్యాస్టింగ్ భారతీయులే ఉండేలా చిత్ర యూనిట్ చూస్తోంది. 

అమితాబచ్చన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మహాభారతం ఆధారంగా ఉండబోతోందని, ప్రభాస్ పాత్రలో కల్కి పోలికలు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అశ్వత్థాముడి జీవితచరిత్ర చుట్టూ ఈ కథ జరగబోతోందని తెలుస్తోంది. టైటిల్ "ప్రాజెక్ట్ కే" లో కూడా కే అంటే అర్థం కల్కి అవతారం అని సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా