గెలుపు ఓటములు లెక్క చేయకుండా.. వరుసగా సినిమాలు చేసుకుంటూ.. పోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే చేతిలో నాలుగు పెద్ద సినిమాలు ఉండగా.. మరో భారీ బడ్జెట్ సినిమాకు అది కూడా బాలీవుడ్ డైరెక్టర్ తో చేయడానికి రెడీ అవుతున్నాడట క్రేజీ హీరో.
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేకుండా .. సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇక ఈసారి మరో బాలీవుడ్ డైరెక్టర్ కు మాటిచ్చాడ యంగ్ రెబల్ స్టార్. బాలీవుడ్ లో ప్రభాస్ కోసం కొత్త ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. వచ్చేవన్నీ వందల కోట్ల బడ్జెట్ సినిమాలే.. అన్నీ పాన్ ఇండియా సినిమాలే.. ఈక్రమంలోనే తాజాగా బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ఓ సినిమా ఓకే చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. ఈ సినిమాను ప్రభాస్ కు సబంధించిన ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ నిన్మించబోతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్ షారుఖ్ ఖాన్ తో పఠాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2023 జనవరిలో విడుదల కానుంది. పఠాన్ తో పాటుగా హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే మరో సినిమా చేస్తున్నాడు సిద్థార్ధ్ ఆనంద్. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తరువాత ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. అటు చిత్రం ఆయన చేతిలో ఉంది. ఈ రెండూ పూర్తవ్వాలి.సాహో, రాధే శ్యామ్ లాంటి వరుస సినిమాల డిజాస్టర్లు అయినప్పటికీ ప్రభాస్ ఇమేజ్ కు ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు. ఆయన సినిమాల కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ కోసం ఈసారి ఓ ఇంట్నేషనల్ సబ్జెక్ట్ ను రెడీ చేశాడట డైరెక్టర్ సిద్థార్ధ్ ఆనంద్. బడ్డెజ్ కాని, గ్రాండియర్ కాని ప్రాజెక్ట్ కే ను మించి ఉండేలా చూసుకుంటున్నారట. అయితే ప్రభాస్ ముందుగా కమిట్ అయిన సినిమాలు పూర్తి అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. ఒక వేల అవి ఉన్నా.. సైమల్టైనస్ గా సినిమాలు చేయగలడు యంగ్ రెబల్ స్టార్. ఈ లెక్కన సిద్థార్ధ్ ఆనంద్ కూడా ఆ రెండు సినిమాలు కంప్లీట్ చేసుకునే వరకూ 2024 వచ్చేస్తుంది. దాంతో ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి బహుశా 2024 వరకు పట్టొచ్చు అని అంటున్నారు సినీ జనాలు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. అటు అది పురుష్ కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నాగ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె మాత్రం చాలా వరకూ పెండింగ్ లో ఉంది. ఈరెండిటి తో పాటు సందీప్ రెడ్డి వంగా తో, మారుతీతో ప్రభాస్ సినిమాలు చేయాల్సి ఉంది. అయితే సందీప్ మాత్రం బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ తో అనిమల్ పూర్తి చేశాక ప్రభాస్ తో స్పిరిట్ మొదలుపెడతాడు. ఇక మారుతీ సినిమా పైమాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.