విషాదంలో పవన్‌ కళ్యాణ్.. బాడీగార్డ్ మృతి

By Satish Reddy  |  First Published Jun 14, 2020, 2:29 PM IST

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ వ్యక్తిగత అంగరక్షకుడు దాస్ చేతన్‌ కామెర్లతో మృతి చెందాడు. చాలా కాలంగా తనకు రక్షణ ఇస్తున్న చేతన్‌ మరణంతో సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.


పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ విషాదంలో మునిగిపోయాడు. చాలా కాలంగా తనకు అత్యంత సన్నిహితుడిగా అంగరక్షకుడిగా ఉన్న దాస్‌ చేతన్ మరణించటంతో ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చేతన్ వయసు 47 సంవత్సరాలు. ఆయన గతంలో కోలీవుడ్‌ స్టార్ హీరోలు సూర్య, విజయ్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ లాంటి వారికి బాడీగార్డ్‌గా పనిచేశాడు. కొన్ని రోజులుగా కామెర్ల వ్యాదితో బాధపుడుతున్న చేతన్‌ కేరళలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా తెలుస్తోంది.

దాస్‌ చేతన్‌ స్వస్థలం కేరళ. ముందుగా మలయాళ నటుల దగ్గర పనిచేసిన ఆయన తరువాత తమిళ హీరో దగ్గర కూడా పనిచేశాడు. ప్రస్తుతం పవన్‌ వ్యక్తిగత రక్షణలో ఉన్నాడు. చేతన్ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

Latest Videos

సినీ తారలు ఇతర ప్రముఖులు రక్షణ సిబ్బంది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. తమ ప్రాణాలకు తెగించి మరీ రక్షణ కల్పిస్తున్న వారికి భారీ మొత్తంలో జీతాలు కూడా ఇస్తారు. సల్మాన్‌ తన అంగరక్షకుడిగా కోట్లలో పేమంట్ ఇస్తుండగా.. ఇటీవల దీపిక కూడా తన వ్యక్తిగత బాడీ గార్డ్‌కు నెలకు 6 లక్షల చొప్పున జీతం ఇస్తున్నట్టు ఓ వార్త వైరల్‌ అయ్యింది.

click me!