Bro The Avatar : ‘బ్రో’ రన్ టైం మరింత అంత తక్కువా? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా!

By Asianet News  |  First Published Jul 15, 2023, 8:08 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘బ్రో’. ఈ చిత్రం మేకర్స్ పై ఫ్యాన్స్ ఇప్పటికే కాస్తా గుస్స మీద ఉన్నారు. తాజాగా మరో న్యూస్ వైరల్ గా మారింది. 
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  అటు పొలిటికల్ షెడ్యూల్, ఇటు మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. చివరిగా ‘భీమ్లా నాయక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం Bro The Avatarతో అలరించబోతున్నారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా మరో ప్రధాన పాత్రలో అలరించబోతున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ నటుడు, దర్శకుడు సముద్రఖని డైరెక్ట్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై గ్రాండ్ గా రూపుదిద్దుకుంటోంది.

జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కాబోతోంది. తమిళంలో సక్సెస్ అందుకున్న ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా వస్తోంది. ఇక తెలుగులో మల్టీస్టారర్ గా రాబోతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరో13 రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో యూనిట్ వరసగా అప్డేట్స్ అందిస్తున్నారు. అయితే, ఫ్యాన్స్ మాత్రం ‘బ్రో’ అప్డేట్స్ విషయం కాస్తా అప్సెట్ అవుతున్నట్టు తెలుస్తోంది. సినిమా రేంజ్ కు తగ్గ ప్రమోషన్స్ చేయడం లేదంటూ మేకర్స్ పై అభిమానులు గుస్స అవుతున్నారు. 

Latest Videos

ఇప్పటికే హీరోయిన్లను అఫీషియల్ గా ప్రకటించలేదు. పైగా రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ విషయంలోనూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు వచ్చిన ‘జానవులే’ సాంగ్ ఏమాత్రం బాగోలేదని సోషల్ మీడియా వేదికన తెలుపుతున్నారు. ‘సాంగ్ తీసేయండి’ అంటూ నిర్మోహమాటంగా  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినిమా రిలీజ్ కు దగ్గరకు వస్తున్నా ప్రమోషన్స్ ను మరీ నత్తనడకలా ఉన్నారంటూ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. బ్రో చిత్రం రన్ టైం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. కేవలం 130 నిమిషాలతోనే సినిమాను పూర్తి చేశారని తెలుస్తోంది. అంటే రెండు గంటల 10 నిమిషాల్లోనే సినిమా ముగుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే రెండున్నర గంటలకు పైగా రన్ టైం ఉండేలా ప్లాన్ చేస్తారు. కానీ మల్టీస్టారర్ గా వస్తున్న ‘బ్రో’లో మరీ ఇంత తక్కువ నిడివి ఉంటుందనడం ఫ్యాన్స్ ను అప్సెట్ చేస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

చిత్రంలో పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్లు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయకులుగా మెరవునున్నారు. బ్రహ్మానందం, సుబ్బరాజు, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా కామియో అపియరెన్స్ ఇవ్వబోతోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

click me!